newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీ కార్యాలయానికి నిప్పు.. సువేందు అధికారిపై దాడి..!

03-05-202103-05-2021 13:11:27 IST
Updated On 03-05-2021 11:20:04 ISTUpdated On 03-05-20212021-05-03T07:41:27.961Z03-05-2021 2021-05-03T04:32:40.004Z - 2021-05-03T05:50:04.753Z - 03-05-2021

బీజేపీ కార్యాలయానికి నిప్పు.. సువేందు అధికారిపై దాడి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్ ఎన్నిక‌ల ఫ‌లితంపై గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. మొదట ఈ స్థానంలో ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గెలిచిన‌ట్లు భావించారు. కానీ చివ‌రికి ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి గెలిచిన‌ట్లు తెలిసింది. మొద‌ట 1200 ఓట్ల‌తో ఇక్క‌డ మ‌మ‌త గెలిచిన‌ట్లుగా మీడియా అంతా ప్ర‌చారం చేసింది. అయితే చివ‌రికి సువేందు 1,736పైగా ఓట్లతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

సువేందు గెలుపును బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  మమతా బెనర్జీ కూడా స్వయంగా ఈ ఓటమిని అంగీకరించారు. నందిగ్రామ్ లో ఓట‌మి గురించి చింతించ‌వ‌ద్దు. ఒక్క సీటుతో వచ్చేదేమీ ఉండదు. పోయేదేమీ ఉండదు. నందిగ్రామ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తాను. నందిగ్రామ్‌లో ఏం జరిగిందో మరిచిపోండి. మనం బెంగాల్‌ను గెలిచాం.. అంటూ మమత పేర్కొన్నారు. ఇక‌ నందిగ్రామ్ ఫలితంపై మమతా కోర్టుకు వెళ్తానని ప్రకటించారు.

నందిగ్రామ్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై అనూహ్య విజయం సాధించిన సువేందు అధికారిపై, హల్దియా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఓ కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అంటున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని అరాంబాగ్‌లో బీజేపీ కార్యాలయం అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనపై టీఎంసీ, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. బీజేపీ కార్యాలయం మంటల్లో చిక్కుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. హుగ్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాంబాగ్‌లో బీజేపీ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీ కార్యాలయం అగ్నికి ఆహుతవుతున్న వీడియోను పోస్టు చేసిన బీజేపీ నేతలు ఇది తృణమూల్ పార్టీ పనేనని ఆరోపించారు. టీఎంసీ గూండాలు తమ కార్యాలయాన్ని తగలబెట్టేశారని బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. బీజేపీ ఆరోపణలపై మమత తీవ్రంగా స్పందించారు. తమ అరాంబాగ్ అభ్యర్థి సుజాతా మండల్‌ను బీజేపీ కార్యకర్తలు వెంబడించి దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   an hour ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   an hour ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   11 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   18 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   19 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   17 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle