newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

చైనా, పాక్ ల‌పై యుద్ధానికి డేట్ ఫిక్స్ చేసిన మోడీ

26-10-202026-10-2020 08:11:09 IST
Updated On 26-10-2020 08:51:55 ISTUpdated On 26-10-20202020-10-26T02:41:09.611Z26-10-2020 2020-10-26T02:41:04.611Z - 2020-10-26T03:21:55.793Z - 26-10-2020

చైనా, పాక్ ల‌పై యుద్ధానికి డేట్ ఫిక్స్ చేసిన మోడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ మ‌ధ్య కాలంలో మ‌న‌కో కొత్త శ‌త్రువు ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే క‌దా. పాకిస్థాన్ తో పాటు.. చైనా కూడా త‌యారైంది. ఆ మ‌ధ్య స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తే.. పాకిస్థాన్ కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నా మ‌ళ్లీ రెచ్చిపోతోంది. ఇక చైనా ఓవ‌ర్ యాక్ష‌న్ కైతే అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అందుకే పీఎం మోడీ యుద్ధానికి రెడీ అయ్యార‌ట‌. మాంచి ముహూర్తం చూసి.. చైనాని, పాకిస్థాన్ ను ముప్ప తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించ‌డానికి రెడీగా ఉన్నార‌ట‌. టైం చూసి.. దెబ్బ కొట్టాల‌ని చూస్తోందంట సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్. పాక్, చైనాతో యుద్దానికి డేట్ కూడా ఫిక్స్ చేశార‌ట పీఎం మోడీ. ఆ డేట్ లోగా ఆయుధాలు రెడీ చేసుకుని సైనికులు రెడీగా ఉండ‌డ‌మే నెక్స్ట్ అట‌. 

ఈ విష‌యాల‌న్నీ ఎవ‌రూ బ‌య‌టికి చెప్ప‌డం లేదు. న్యూస్ లో కూడా పెద్ద‌గా రావ‌డం లేదు. కానీ.. యూపీ బీజేపీ లీడ‌ర్ ఇలాంటి చాలా విష‌యాలు చెప్పారు. అత‌నేం అల్లాట‌ప్పా లీడ‌ర్ కాదు. బీజేపీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్  అధ్య‌క్షుడు. సో చాలా విష‌యాల్లో క‌న్ఫ‌ర్మేష‌న్లు వ‌చ్చాయి. బీజేపీకి యూపీ ఎంత ఇంపార్టెంటో తెలిసిందే క‌దా. అక్క‌డి లీడ‌ర్ల‌కి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ కి క్లోజ్ రిలేష‌న్స్ ఉంట‌య్. సో.. మోడీతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ త‌న‌కి తెలిస్తే చెప్పారా. లేదంటే ఇండైరెక్ట్ గా విష‌యాన్ని బ‌య‌టికి తీసుకెళ్లాల‌నే ప్లానా అర్దం కావ‌డం లేదు. బ‌ట్.. విష‌యంపై చాలా మందికి బిలీఫ్ వ‌చ్చింది. రామ‌మందిరం, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దులాగే.. మోడీ ముందు నుంచే ఈ యుద్ధంపై కూడా క్లారిటీగా ఉన్నార‌ని స్వ‌తంత్ర దేవ్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఫంక్ష‌న్ కి అటెండ్ అయిన స్వ‌తంత్ర దేవ్ ఈ విష‌యాలు మాట్లాడిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సోష‌ల్ మీడియా లో పోస్టులు షేర్ల‌తో క్రేజీగా వెళ్తోంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle