newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ

04-03-202104-03-2021 16:12:50 IST
2021-03-04T10:42:50.280Z04-03-2021 2021-03-04T10:19:12.314Z - - 11-04-2021

ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేవలం భాష అన్న ఒక్క అవరోధం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యాలను వృథా కానివ్వొద్దని, దేశ అభివృద్ధి ప్రయాణంలో పల్లె ప్రజలను, పేద వర్గాలను సైతం కలుపుకొని వెళ్లాలని ప్రధాని నరేంద్రమోదీ దిశానిర్దేశం చేశారు. ఈ లక్ష్యం తోనే దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చిందని ప్రధాని చెప్పారు. విద్యా రంగం కోసం కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనల సమర్థ అమలుపై బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. 

దేశంలో, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విషయాలను లేదా కంటెంటును ప్రాంతీయ భాషల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత భాషా నిపుణులపై ఉందని మోదీ చెప్పారు.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఇది సాధ్యమేనని సూచించారు. జ్ఞానానికి, పరిశోధనలకు పరిమితులు విధించుకోవడం అంటే దేశానికి పెద్ద అన్యాయం చేసినట్లేనని తేల్చిచెప్పారు. అంతరిక్షం, అణుశక్తి, డీఆర్‌డీఓ, వ్యవసాయం తదితర కీలక రంగాల్లో ప్రతిభావంతులైన మన యువతకు తలుపులు తెరిచి ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. 

విద్యా వ్యవస్థలో భాషాపరమైన అవరోధాలను తొలగించడానికి మిషన్‌ మోడ్‌లో పని చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు.. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు, పేదలకు తగిన అవకాశాలు దక్కుతాయని, వారి జీవితాలు మెరుగవుతాయని తెలిపారు.

స్వావలంబన సాధించిన దేశంగా భారత్‌ మారాలంటే యువతకు తమపట్ల తమకు విశ్వాసం ఉండాలనీ, అది జరగాలంటే వారు ఆర్జించిన విద్య, విజ్ఞానం పట్ల పూర్తి నమ్మకం పెంచుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. మన విద్యా వ్యవస్థలో ప్రాంతీయ భాషలకు చాలా ప్రాధాన్యం ఉంది. సబ్జెక్టును అర్థం చేసుకోవడంలో భాష ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య దాకా అత్యత్తమ కంటెంట్‌ను మన ప్రాంతీయ భాషల్లో తీసుకురావాలి. మెడికల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌.. అన్ని సబ్జెక్టుల్లో ప్రపంచ స్థాయి కంటెంట్‌ ప్రాంతీయ భాషల్లో రావాలని మోదీ సూచించారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యం తర్వాత విద్యా, నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, ఉపాధి, వ్యాపార సామర్థ్యాన్ని విద్యతో అనుసంధానించడమే లక్ష్యంగా మేము సాగిస్తున్న ప్రయత్నాలకు ఈ బడ్జెట్‌ మరింత ఊతం ఇస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తపరిచారు. మా ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వైజ్ఞానిక ప్రచురణలు, పీహెచ్‌డీ స్కాలర్లు, స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లో ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో భారత్‌ స్థానం సంపాదించింది. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో ప్రపంచంలోని మొదటి 50 దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. తన స్థానాన్ని క్రమంగా మెరుగుపర్చుకుంటోందని మోదీ తెలిపారు.

ప్రి–నర్సరీ నుంచి పీహెచ్‌డీ స్థాయి దాకా జాతీయ విద్యా విధానంలోని అన్ని ప్రతిపాదనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో మన విద్యార్థులకు, యువ సైంటిస్టులకు కొత్త అవకాశాలు నానాటికీ పెరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   10 hours ago


ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   14 hours ago


టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   20 hours ago


ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   20 hours ago


ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021


వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021


అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021


డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021


పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021


అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle