newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

04-12-202004-12-2020 10:59:52 IST
2020-12-04T05:29:52.577Z04-12-2020 2020-12-04T05:29:49.867Z - - 28-01-2021

ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికాను కరోనా భూతం సులభంగా వదిలేటేట్టు లేదు. భారత్ వంటి దేశాలు కరోనా వ్యాప్తి నుంచి అనూహ్యంగా బయటపడుతుండగా అమెరికాలో వైరస్ మళ్లీ తిరగబెట్టింది. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో అమెరికాలో 3,157 కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 1,00,226 మంది ఆసుపత్రిపాలయ్యారు. రాబోయే తీవ్రమైన చలిరోజుల్లో దేశం మరింత గడ్డుపరిస్థితులను ఎదుర్కోక తప్పదని అమెరికా ప్రధాన వైద్యాధికారి హెచ్చరించారు. 

ఈ సంవత్సరం ఏప్రిల్‌ 15తో పోల్చుకుంటే అమెరికాలో కోవిడ్‌ మరణాల సంఖ్య 20 శాతం పెరిగింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 2,80,581 మంది మరణించగా, 14 కోట్లమందికి పైగా కోవిడ్‌ సోకినట్టు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. కాగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్స్‌ హెచ్చరించారు. 

నవంబర్ 10 నుంచి అమెరికాలో ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. దీంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోనున్నాయని అమెరికన్ మీడియా పేర్కొంది.

ఎక్కువ మంది ఒకచోట చేరకూడదని హెచ్చరిస్తున్నా వినకుండా, గత వారంలో జరిగిన థ్యాంక్స్‌ గివింగ్‌ లాంటి ఉత్సవాలను జరుపుకునేందుకు లక్షలాది మంది అమెరికన్లు ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించడం కూడా కోవిడ్‌ వ్యాప్తికి కారణమని భావిస్తున్నారు.  

జాతి ప్రజారోగ్య చరిత్రలోనే అత్యంత కష్టకాలాన్ని అమెరికా ఎదుర్కోబోతోందని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ హెచ్చరించారు. తక్కువ సంఖ్యలో పడకలు, మితిమీరి పనిచేస్తున్న వైద్య సిబ్బంది వల్ల దేశవ్యాప్తంగా ఆసుపత్రులపై భారం పెరిగిపోయిందని చెప్పారు. మరోవైపున దేశంలో 911 ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్ కుప్పకూలే దశకు చేరుకుందని అమెరికన్ అంబులెన్స్ అసోసియేషన్ హెచ్చరించింది.

దేశ పశ్చిమ ప్రాంతంలో మూడో దశ ప్రవేశసిస్తున్న తరుణంలో అదనపు ఉపశమన చర్చలు చేపట్టకుంటే ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పగూలే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

   2 hours ago


పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

   3 hours ago


నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

   4 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

   5 hours ago


ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

   5 hours ago


ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

   7 hours ago


అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

   8 hours ago


ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

   19 hours ago


డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

   27-01-2021


భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

   27-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle