newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

చైనా ఆటలు గమనిస్తున్నాం.. భారత్‌తో త్వరలో చర్చలు.. అమెరికా

25-10-202025-10-2020 09:36:16 IST
Updated On 25-10-2020 10:01:20 ISTUpdated On 25-10-20202020-10-25T04:06:16.230Z25-10-2020 2020-10-25T04:06:13.638Z - 2020-10-25T04:31:20.454Z - 25-10-2020

చైనా ఆటలు గమనిస్తున్నాం.. భారత్‌తో త్వరలో చర్చలు.. అమెరికా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తూర్పు లదాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితులను గమనిస్తున్నామని, దక్షిణ చైనా సముద్రం సహా ఇండో పసిఫిక్‌ జలాల్లో దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు దీటుగా బదులిచ్చేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా పునరుద్ఘాటించింది. ఆగ్నేయాసియాలో కీలక దేశమైన భారత్‌కు ఎల్లప్పుడు తన మద్దతు ఉంటుందని పేర్కొంది. 2016 నుంచి ఇండియా తమ మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌గా మారిందని, గత నాలుగేళ్లుగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాల విషయంలో ఇటీవల కీలక ముందడుగు పడిందని పేర్కొంది. 

భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు సమస్యను నిశితంగా గమనిస్తున్నామని, ఈ సమస్య ముదరకూడదని కోరుతున్నామని ట్రంప్‌ ప్రభుత్వంలో సీనియర్‌ అధికారి  ఒకరు చెప్పారు. భారత్‌కు తమ ప్రభుత్వం ఆయుధాల విక్రయాలు, సంయుక్త మిలటరీ విన్యాసాలు, సమాచార పంపిణీలాంటి పలు రూపాల్లో సహకరిస్తోందన్నారు. కేవలం హిమాలయ ప్రాంత సమస్యల విషయంలోనే కాకుండా భారత్‌కు అన్ని అంశాల్లో తాము సహకరిస్తున్నామని చెప్పారు. లద్దాఖ్‌ తదితర సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా మధ్య టెన్షన్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో అన్ని వ్యవహారాల్లో భారత్‌ మరింత పాత్ర పోషించాలని తాము భావిస్తున్నట్లు అమెరికా అధికారి చెప్పారు.

కాగా సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన ఒప్పందాల గురించి భారత్‌- అమెరికాల మధ్య వచ్చే వారం 2+2 చర్చలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బేసిక్‌ ఎక్స్స్ఛేంజ్‌ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌(బీఈసీఏ)పై భారత్‌ సంతకం చేయనుంది. శత్రు దేశాలకు దీటుగా బదులిచ్చే క్రమంలో వారి స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు ఉద్దేశించిన ఎంక్యూ- 9బి వంటి ఆర్మ్‌డ్‌ డ్రోన్స్‌ దిగుమతి తదితర అంశాల గురించి ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదరనుంది. 

చర్చలు విజయవంతమైన తరుణంలో యూఎస్‌ గ్లోబల్‌ జియో- స్పేషియల్‌ మ్యాపులు ఉపయోగించి క్రూయిజ్‌ మిసైల్స్‌, బాలిస్టిక్‌ క్షిపణుల కచ్చితమైన జాడను తెలుసుకునే వీలు కలుగుతుంది. దీంతో దొంగ దెబ్బ తీయాలనుకునే శత్రు దేశాల వ్యూహాలను చిత్తు చేసి వారికి దీటుగా బదులిచ్చే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ పాలనా యంత్రాంగంలోని సీనియర్‌ అధికారులు శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘హిమాలయాల నుంచి దక్షిణ చైనా సముద్రం నుంచి వరకు ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలకు బదులిచ్చే క్రమంలో సారూప్య భావజాలం, ఒకే విధమైన ఆలోచనా విధానం కలిగిన ఇండియా వంటి భాగస్వామితో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. మలబార్‌ నావికాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియాతో జట్టుకట్టనున్నట్లు ఇటీవల భారత్‌ చేసిన ప్రకటన పట్ల మాకెంతో సంతోషంగా ఉంది. భారత్‌కు మా మద్దతు ఉంటుంది. సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడితో ముందుకు సాగుతాం.

త్వరలోనే జరుగనున్న చర్చల్లో భాగంగా,  ఆగ్నేయాసియా ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, దక్షిణ చైనా సముద్రం తదితర అంశాల్లో భారత్‌ భాగస్వామ్యం మరింతగా పెరగడాన్ని స్వాగతిస్తున్నాం. తూర్పు లదాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది’’ అని పేర్కొన్నారు. 

ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు క్వాడ్‌ పేరిట భారత్, యూఎస్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్‌లు జట్టుకట్టాయి. చైనా ఇటీవల కాలంలో దక్షిణ, తూర్పు సముద్రాల్లో అన్ని పొరుగుదేశాలతో వివాదాలు పడుతోంది. తన ద్వీపాల్లో భారీగా మిలటరీ మోహరింపులు చేస్తోంది. ఈ సముద్ర జలాల్లో యూఎస్‌కు ఎలాంటి వాటా లేకున్నా, చైనా ఆధిపత్యం పెరగకుండా ఉండేందుకు ఆయా దేశాలకు సాయం చేస్తోంది. చైనాకు సవాలు విసురుతున్నట్లుగా ఈ సముద్ర జలాల్లో అమెరికా వార్‌షిప్పులు, ఫైటర్‌ జెట్లను మోహరిస్తోంది. అంతర్జాతీయ స్వేచ్ఛా నౌకాయానానికి భంగం కలగకుండా ఉండేందుకే తాము ఈ జలాల్లో ప్రవేశిస్తున్నామని అమెరికా చెబుతోంది.  

కాగా కాగా పరస్పర సైన్య సహకారం, ఇండో- పసిఫిక్‌ జలాల్లో నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle