newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

09-04-202109-04-2021 09:14:10 IST
2021-04-09T03:44:10.725Z09-04-2021 2021-04-09T03:28:11.632Z - - 15-05-2021

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమేనని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదార్ పూనవల్లా స్పష్టం చేశారు. అమెరికా, యూరప్ వ్యాక్సిన్ తయారీలో ముఖ్యమైన ముడిసరకు ఎగుమతిని నిలిపివేసిన కారణంగానే దేశంలో వ్యాక్సిన్ తయారీ తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు.

ప్రతినెలా దాదాపు 6.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థగా రికార్డుకెక్కింది. సీరమ్ సంస్థ ఉత్పత్తి ప్రమాణాల వల్లే భారత్ దేశీయ అవసరాలతో పాటు మరో 80 దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ని రెండున్నర నెలలలోపు సరఫరా చేసి రికార్డు సృష్టించింది.

అయితే ఇటీవల దేశంలోనే వ్యాక్సిన్ కేంద్రాల్లో కరోనా టీకా నిల్వలు హరించుకుపోతున్నాయని వార్తలు రావడంపై సీరమ్ సీఈఓ స్పందించారు. యూరప్, అమెరికాలు అత్యంత కీలకమైన ముడిసరకును ఎగుమతి చేయడంపై నిషేధం విధించడం వల్లే భారత్‌లో కరోనా టీకాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని అదార్ పూనవిల్లా పేర్కొన్నారు. 

మీరు ఇలా కీలకమైన ముడిసరకుపై నిషేధం ప్రకటించడం వల్లే భారత్‌లో కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారీకి ఆంటకాలు ఏర్పడుతున్నాయని అమెరికాకు వెళ్లి నిరసన తెలుపడానికి తాను సిద్ధమేనని సీరమ్ సీఈఓ చెప్పారు. భారత్‌లోనూ, ప్రపంచంలోనూ అనేక వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఈ ముడిసరకు చాలా అవసరమని, దాన్ని నిషేధిస్తే ప్రపంచవ్యాప్తంగానే దాని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.  అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

కేవలం ముడిసరకు అందకపోవడం వల్లే వ్యాక్సిన్ ఉత్పత్తిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయితే ఈ సమస్య తాత్కాలికమే. ఎందుకంటే మరో ఆరునెలలు లేదా సంవత్సరం తర్వాత మనం ఇతర సరఫరాలను అభివృద్ధి చేసుకోగలం అని అధార్ ఆత్మవిశ్వాసం ప్రకటించారు.

అలాగని చైనా నుంచి వ్యాక్సిన్ ముడిసరుకు దిగుమతికి తాము ప్రయత్నించడం లేదని సీరమ్ సీఈఓ చెప్పారు. నాణ్యతా సమస్యలు, సరఫరాలో అడ్డంకుల కారణంగా చైనా ముడిసరుకు జోలికి తాము వెళ్లలేదని పేర్కొన్నారు.

ఇప్పటివరకు నెలకు 6 నుంచి 6.5 కోట్ల వరకు కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఈ సంవత్సరం జూన్ నాటికి 10 నుంచి 11 కోట్ల టీకాల తయారీని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరమ్ భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, అస్ట్రాజెనెకాలు రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ని కోవిషీల్ట్ పేరిట భారీస్థాయిలో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.

 

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   11 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   17 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   14-05-2021


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle