newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

03-12-202003-12-2020 15:25:09 IST
2020-12-03T09:55:09.784Z03-12-2020 2020-12-03T09:55:04.883Z - - 28-01-2021

హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హెచ్‌–1బీ వీసాల్లో ట్రంప్‌ సర్కార్‌ ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని అమెరికా కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది చివరి వరకు హెచ్‌–1బీ వీసాలను రద్దు చేస్తూ అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌1–బీ వీసా విధానంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి. కోర్టు తీర్పుతో అమెరికాలో భారతీయ టెక్కీలకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. 

వీసా విధానంలో మార్పులు తీసుకురావడంలో ట్రంప్‌ సర్కార్‌ పారదర్శకంగా వ్యవహరించలేదని కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ప్రభుత్వం వీసా విధానంలో మార్పులపైన చర్చించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్న న్యాయమూర్తి.. విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలు విదేశీ పనివారి నియామకంలో ఉన్న పరిమితుల్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. డిసెంబర్‌ 7 నుంచి ఈ నిర్ణయాలేవీ అమలు చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి.

సర్కారు ఈ సవరణలను.. కరోనా వల్ల ఉద్యోగ నష్టాలను పూడ్చే ప్రయత్నమంటూ సమర్థించుకోవడం సరికాదని.. కరోనాకు ముందే ట్రంప్‌ సర్కారుకు ఈ ఆదేశాల జారీపై ఒక స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. కోర్టు తాజా నిర్ణయంతో భారతీయ టెకీలు, భారతీయ కంపెనీలకు ఊరట లభించినట్లయింది. అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు డోనాల్డ్ ట్రంప్‌ సర్కార్‌ వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబరులో ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. థర్డ్‌ పార్టీ సంస్థల్లో హెచ్‌1-బీ ఉద్యోగ నియామకాలపై ఏడాది నిషేధం ఉంటుంది.

విదేశీ నిపుణులను అడ్డుకోవడం ద్వారా.. స్థానికులకు ఉపాధి లభిస్తుందనేది ట్రంప్‌ సర్కారు ఉద్దేశం. ఈ నిర్ణయాన్ని బే ఏరియా కౌన్సిల్‌, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, యుఎస్‌ చాబర్‌ ఆఫ్‌ కామర్స్‌, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మానుఫ్యాక్చరర్స్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి గ్రూపులు కోర్టులో సవాలు చేశాయి. వాదోపవాదాలు విన్న కోర్టు.. ఈ ఆంక్షలను తోసిపుచ్చింది.

హెచ్‌1-బీ వీసా జారీ విధానానికి ట్రంప్‌ సర్కారు చేసిన కీలక సవరణలకు అమెరికా కోర్టు బ్రేకులు వేయటంతో అమెరికాలోని భారతీయ ఉద్యోగులు హర్షం ప్రకటించారు.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

   2 hours ago


పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

   3 hours ago


నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

   4 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

   5 hours ago


ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

   6 hours ago


ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

   7 hours ago


అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

   8 hours ago


ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

   19 hours ago


డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

   27-01-2021


భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

   27-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle