newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మావోయిస్టుల్లోనూ 20 పైగా మృతులు.. లెక్క సరిచేశామంటున్న కేంద్ర బలగాలు

05-04-202105-04-2021 12:13:39 IST
2021-04-05T06:43:39.805Z05-04-2021 2021-04-05T06:43:31.697Z - - 16-04-2021

మావోయిస్టుల్లోనూ 20 పైగా మృతులు.. లెక్క సరిచేశామంటున్న కేంద్ర బలగాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చత్తీస్‌గఢ్ సుకుమా అడవుల్లో వందలాది మావోయిస్టులు ముందస్తుగా పన్నిన ఎరలో చిక్కుకున్న కేంద్రబలగాల్లో 24 మందికి పైగా బలయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మావోయిస్టులను కూడా భారీగానే మట్టుపెట్టామని కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు, కేంద్ర హోంశాఖ ప్రకటించాయి. నిఘా డ్రోన్ హెరోన్ చిత్రీకరించిన దాన్ని బట్టి 20మంది పైగా మృతిచెందిన తమ సహచరులను రెండు ఫెర్రీ ట్రాక్టర్ ట్రాలీల్లో వేసుకుని మావోయిస్టులు పారిపోయారని పక్కాగా సమాచారం తెలిసింది.

శనివారం మధ్యాహ్నం నుంచి చత్తీస్ గఢ్‌లో మావోయిస్టులపై కేంద్ర సంయుక్త బలగాలు తలపెట్టిన..  దాదాపుగా యుద్ధాన్ని తలపించిన భీకరపోరులో 24 మందికి పైగా పారామిలటరీ బలగాలు మృతి చెందగా, మరో 30 పైగా బలగాలకు తీవ్ర గాయాలయినట్లు నిర్ధారణ అయింది. కానీ మావోయిస్టులు పన్నిన ఉచ్చునుంచి బయటపడి త్వరలో ఎదురు దాడి తీశామని ఈ క్రమంలో 20మందిపైగా మావోయిస్టులను మట్టుపెట్టామని ఆదివారం కేంద్ర హోంశాఖ, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు ప్రకటించాయి.

సైనిక బలగాలు సంఘటనా స్థలంలోకి పంపిన హెరోన్ డ్రోన్ పంపిన వీడియోను బట్టి 20 మందికి పైగా మావోయిస్టులను హతమార్చినట్లు గ్రహించామని సీఆర్‌పీఎఫ్ ప్రతినిధి తెలిపారు. హతమైన మావోయిస్టుల శవాలను రెండు ట్రాక్టర్ ట్రాలీల్లో వేసుకుని దట్టమైన అడవుల్లోకి మావోయిస్టులు పారిపోయారని చెప్పారు.

మా అంచనా ప్రకారం హోరాహోరీ పోరులో 12 నుంచి 20 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని భావిస్తున్నాం. సంఘటనా స్థలానకి రెండు ట్రాక్టర్ ట్రాలీలను తెప్పించుకున్నారంటేనే వారి వైపు కూడా మృతులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలుస్తోందని సీనియర్ సీఆర్‌పీఎఫ్ అధికారి తెలిపారు. 

వందలాది మావోయిస్టులు వలపన్ని కోబ్రా, బ్లాక్ పాంథర్స్, డిఆర్‌జి-ఎస్టీఎఫ్ బలగాలను చుట్టుముట్టి భారీ నష్టం కలిగించాలని చేసిన ప్రయత్నాన్ని తమ బలగాలు వమ్ము చేశాయని, మావోయిస్టుల పన్నాగం విపలమైందని ఆ అధికారి చెప్పారు. మావోయిస్టుల పెనుదాడిని మా పద్ధతిలో ఎదుర్కొని ఎదురుదెబ్బ తీశామని సీఆర్పీఎఫ్ చెప్పుకొచ్చింది.

శనివారం జరిపిన ప్రారంభ దాడి తర్వాత ఆదివారం ఉదయం మరోసారి మావోయిస్టులు కేంద్ర పోలీసు బలగాలను చుట్టుముట్టాలని ప్రయత్నించగా దాన్ని కూడా తాము తిప్పికొట్టామని, భద్రతా బలగాలు తమ స్థావరానికి క్షేమంగా చేరుకున్నాయని సీఆర్ఫీఎఫ్ అదికారి పేర్కొన్నారు.

మావోయిస్టు కార్యకలాపాల కేంద్రస్థానమైన బస్తర్ లోని  బీజాపూర్-సుక్మా ప్రాంతంలో ఆంబుష్, తదనంతరం ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడంతో ఇరుపక్షాల్లోనూ భారీగానే గాయపడ్డారని మరొక అధికారి తెలిపారు. బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లతో మావోయిస్టులు దాడి చేసినందువల్లనే భద్రతాబలగాలు పెద్ద సంఖ్యలో చనిపోయినట్లు సీఆర్పీఎఫ్ అధిరారి తెలిపారు. భద్రతా బలగాలు కూడా ఆటోమేటిక్ ఆయుధాలను జతచేర్చిన గ్రెనేడ్ లాంచర్లతో తమపై దాడిని తిప్పికొట్టాయని చెప్పారు.

శనివారం 11 గంటల 10 నిమిషాలకు ఇరుపక్షాల మధ్య భారీగా కాల్పుల ఘటన చేసుకుందని, గ్రెనేడ్ లాంచర్లతో సాగిన ఈ దాడి యుద్ధాన్ని తలపించిందని సీర్పీఎఫ్ అధికారి చెప్పారు. దాదాపు 460 మందితో కూడిన భద్రతా బలగాలు, 250కి పైగా మావోయిస్టుల ఉచ్చునుంచి తప్పించుకుని ఎదురుదాడి చేస్తూనే మైదాన ప్రాంతంలోకి చేరుకున్నారని, అందుకే గాయపడిన బలగాలను త్వరగా ఆస్పత్రికి చేర్చగలిగామని ఆ అధికారి పేర్కొన్నారు. 

కాల్పుల ఘటన అనంతరం హోంమంత్రి అమిత్ షా ఆదివారం సీనియర్ అధికారులతో ఢిల్లీలో అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు. హోం సెక్రటరీ అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్, సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. 

హోంమంత్రి ఆదేశాల మేరకు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కులదీప్ సింగ్ రాయ్‌పూర్ చేరుకుని బలగాల పరిస్థితిని సమీక్షించారు. కాగా మావోయిస్టు కార్యకలాపాలపై హోంశాఖ సలహాదారు కె విజయకుమార్ జగదల్‌పూర్‌లో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిసింది.

రెండు నెల‌లుగా ఆగ‌ని మార‌ణకాండ‌.. సైన్య‌మే చంపేస్తే ఎవ‌రికి చెప్పుకోవాలి

సోమవారం అధికారులతో మరో సమావేశాన్ని హోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేయనున్నారు. భద్రతా బలగాలపై దాడిచేసిన మావోయిస్టులకు తగిన సమాధానం చెబుతామని షా చెప్పారు. ఇరు పక్షాలల్లో వాస్తవంగా జరిగిన నష్టం గురించి అంచనా వేస్తున్నామన్నారు

దాదాపు పదేళ్ల తర్వాత భారత భద్రతా బలగాలపై భీకరదాడికి దిగిన మావోయిస్టులు సీఆర్పీఎఫ్ దళాలపై పెనుదెబ్బతీసిన నేపథ్యంలో దీని పర్యవసానాలు తీవ్రస్థాయిలోనే ఉంటాయని అంచనా.

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   10 hours ago


కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   14 hours ago


రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   16 hours ago


సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago


మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   15-04-2021


ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   19 hours ago


దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021


ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021


ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle