newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఏలియన్ అనుకుని యూపీ పోలీసులు ఛేజింగ్ చేశారట

18-10-202018-10-2020 15:49:29 IST
Updated On 18-10-2020 16:06:49 ISTUpdated On 18-10-20202020-10-18T10:19:29.750Z18-10-2020 2020-10-18T10:19:26.905Z - 2020-10-18T10:36:49.300Z - 18-10-2020

ఏలియన్ అనుకుని యూపీ పోలీసులు ఛేజింగ్ చేశారట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఉత్తరప్రదేశ్ పోలీసులకు గ్రహాంతరవాసికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే వారు ఆ గ్రహాంతరవాసిని పట్టుకోడానికి బయలుదేరారు. గాలిలో ఏదో తేలియాడుతూ కనిపించింది. నిజంగానే గ్రహాంతరవాసి అనుకున్నారేమో.. ప్రజలు చాలా భయపడ్డారు.. పోలీసులు ఎప్పుడైతే దాని దగ్గరకు వెళ్లారో..  అప్పుడు వారికి అర్థం అయింది. అది ఏలియన్ కాదని..! ఇంతసేపు వారు పట్టుకోవాలని ప్రయత్నించింది హాలీవుడ్ లో బాగా ఫేమస్ ఐరన్ మ్యాన్ సూట్ ను పోలిన బెలూన్. గాల్లోకి ఎగురుతూ కనిపించడంతో ఏదో వింతజీవి అని అనుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో శనివారం చోటుచేసుకుంది. 

గ్రేటర్‌ నోయిడాలోని దాన్‌కౌర్‌ ప్రాంతంలో నిన్న ఉదయం ఓ వింత ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత ఓ కాలువలోకి దిగి, అక్కడే కొద్దిసేపు కదులుతూ కనిపింది. దాని చూసి ఏలియనే అంటూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దాన్‌కౌర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ పాండే అక్కడికి చేరుకున్నాక అసలు విషయం బయటపడింది. ఏలియన్‌ కాదని ఐరన్‌ మ్యాన్‌ను పోలి ఉన్న బెలూన్ అని ధృవీకరించారు. ఈ వార్తపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ‌


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle