newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

28-09-202028-09-2020 14:02:24 IST
Updated On 28-09-2020 14:14:02 ISTUpdated On 28-09-20202020-09-28T08:32:24.300Z28-09-2020 2020-09-28T08:32:21.021Z - 2020-09-28T08:44:02.523Z - 28-09-2020

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకూ ఉధృతమౌతున్నది. లాక్  డౌన్ సమయంతో పదుల సంఖ్యలొ నమోదైన పాజిటివ్ కేసులతో పోలిస్తే ఇప్పుడు రోజుకు 80వేలకు పైన కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. పది హేను రోజుల కిందట అయితే ఏకంగా రోజుకు లక్షకు పైన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి నయమైన వారిలో యాండీ బాడీస్ డెవలప్ అవుతాయనీ, అటువంటి వారికి మరోసారి కరోనా రాదనీ చాలా మంది భావిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జరిగిన సిరం సర్వే విస్పష్టంగా తేల్చేసింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడి చర్యలను గాలికొదిలేసి వేగంగా అన్ లాక్ దశలోనికి ప్రయాణిస్తున్నాం.

దశల వారీ అన్ లాక్ లో భాగంగా ఇప్పటి వరకూ నాలుగు అన్ లాక్ లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా  బుధవారం నుంచి అన్ లాక్ 5 ప్రకటించబోతున్నది. అన్ లాక్ 5 మార్గదర్శకాలనూ విడుదల చేసేసింది. ఈ అన్  లాక్  5 అక్టోబర్ 1 నుంచి అమలులోనికి వస్తుంది. అన్ లాక్ 5 మార్గదర్శకాలు  చూసిన తరువాత అన్ లాక్ 5 అనడం కంటే ఆల్ ఓపెన్ అనడం మేలని ఎవరికైనా అనిపించక తప్పదు.  ఎందుకంటే..ఇప్పటికే ఇచ్చిన సడలింపులకు తోడు మరిన్ని సడలింపులతో అన్ లాక్ 5 ప్రారంభం కానుంది. ఆ తరువాత ఇక అన్ లాక్ చేయడానికి ఏమీ మిగలకపోవచ్చు. అందుకే ఇదే చివరి అన్ లాక్ అని అంటున్నారు.

ఇక ఇటీవలే కరోనా వ్యిప్తి తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఆ భేటీలో మోడీ ఆయా సీఎంల ముందు ఉంచిన ప్రతిపాదనలను బట్టి చూస్తే కూడా కరోనా కట్టడి కోసం ఎటువంటి కార్యకలాపాలనూ ఆపేందుకు కేంద్రం సిద్ధంగా లేదని అర్ధమౌతున్నది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో వ్యప్తి కట్టడికి అవసరమైతే...మైక్రో కంటైన్మెంట్ జన్లు, ఆయా ప్రాంతాలలో కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి చర్యలు అవసరమంటే తీసుకోండంటే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. అన్ లాక్ ఫైవ్ అంటే జనం భయపడే పరిస్థితి ఏర్పడటానికి కారణమేమిటంటే...అక్టోబర్, నవంబర్ నెలలు దేశంలో అత్యంత కీలకమైన, ప్రముఖమైన, ప్రధానమైన పండుగల సీజన్. దసరా, దీపావళి పండుగలు ఈ నెలల్లోనే ఉంటాయి.

ఆ తరువాత డిసెంబర్ లో క్రిస్మస్ వస్తుంది. ఈ పండుగ సీజన్ లో నిబంధనలను పూర్తిగా ఉపసంహరించేయడం వల్ల  జనం పెద్ద ఎత్తున బయటకు వస్తారు. పండుగ సీజన్ కనుక కొనుగోళ్ల యాక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఏదో మేరకు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒకింత ఊపు వస్తుందన్నది ప్రభుత్వ యోచనగా కనిపిస్తున్నది. అదే యాక్టివిటీ బాగా పెరగడం వల్ల ఇప్పటికే ఆందోళన కరస్థాయిలో ఉన్న కరోనా వ్యాప్తి మరింత ఉధృతమౌతుందని జనం భయపడుతున్నారు.  


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle