newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ట్రంపుది ఓవ‌ర్ యాక్ష‌నా..? ఓవ‌ర్ కాన్ఫిడెన్సా..?

18-10-202018-10-2020 13:27:42 IST
Updated On 18-10-2020 13:35:18 ISTUpdated On 18-10-20202020-10-18T07:57:42.176Z18-10-2020 2020-10-18T07:57:18.523Z - 2020-10-18T08:05:18.210Z - 18-10-2020

ట్రంపుది ఓవ‌ర్ యాక్ష‌నా..? ఓవ‌ర్ కాన్ఫిడెన్సా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

యాక్ష‌న్ అయినా.. ఓవ‌ర్ యాక్ష‌న్ అయినా.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అయినా స‌రే. ట్రంపు ట్రంపే. ఎక్క‌డా త‌గ్గ‌డు. ఎవ‌రు చెప్పిందీ విన‌రు. అందుకే.. ఆయ‌న్ని ట్రంపు అంటారు. ఈ మిడిల్ ఫింగ‌ర్ చూపించే మెంటాలిటీతో చాలా ఇబ్బందులు ప‌డుతున్నా.. త‌గ్గే ర‌కం అయితే కాదు. ఆ మ‌ధ్య క‌రోనాకి కూడా కూడా మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తే.. కాళ్లూ చేతులూ ముడుచుకుని మిలిట‌రీ హాస్పిట‌ల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఫ్యామిలీ ఫ్యామిలీకి ట్రీట్మెంట్ త‌ప్ప‌లేదు. ఇప్పుడు కూడా ఎల‌క్ష‌న్ పై అదే ఫీలింగ్ తో ఉన్నారు ట్రంపు సారు. 

మామూలుగానే తుంట‌రి కాస్త‌. ఇప్పుడు ఇంకాస్త తెగింపుతో వెళ్తున్నారు. ఆల్ర‌డీ ఒక‌సారి ప్రెసిడెంట్ గా చేశారు. మామూలుగానే డోనాల్డ్ ట్రంప్ కు కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ కాస్త ఎక్కువ‌. ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యే స‌రికి సూప‌ర్ మ్యాన్ లా ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా ఎవ‌రు ఎన్ని చిందులేసినా.. మ‌రో నాలుగేళ్ల పాటు అమెరికా నాదే అంటున్నాడు ట్రంపు సారు. మ‌న‌ల్ని గెలిచే సీన్ ఎవ‌రికీ లేదు. తాటాకు చ‌ప్పుళ్ల‌కి భ‌య‌ప‌డేది లేదు అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఎల‌క్ష‌న్స్ ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంపు సారు. మామూలుగా అక్క‌డ టూటైమ్స్ ప్రెసిడెంట్ గా ఉండే ఛాన్సే ఉంటుంది. అంత‌కు మించి కుద‌ర‌దు. అందుకే.. ఆ ఛాన్స్ ని కంప్లీట్ గా ఉప‌యోగించుకుని.. 8 ఏళ్ల పాటు ప్రెసిడెంట్ గా ఉండాల‌ని చూస్తున్నారు ట్రంపు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ ఛాన్స్ రాదు అంటూ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ గెలుపు కోసం ట్రై చేస్తున్నారు. ఇక క‌రోనా మీద కూడా గెలిచిన టైం కావ‌డంతో.. ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. క‌రోనా మీద అమెరికాని గెలిపించ‌లేక పోయినా.. త‌న‌కు తానుగా అయితే గెలిచాడు క‌దా. అదీ దీని వెన‌క రీజ‌న్. ట్రంపుకి ఫాలోయింగు కూడా అదే రేంజ్ లో ఉన్నా.. ఆయ‌న‌గారి కాన్ఫిడెన్స్ కాస్త బోర్డ‌ర్స్ క్రాస్ చేసిన‌ట్లే ఉంది అనే టాకూ వినిపిస్తోంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle