వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
16-01-202116-01-2021 15:33:42 IST
Updated On 16-01-2021 13:23:49 ISTUpdated On 16-01-20212021-01-16T10:03:42.240Z16-01-2021 2021-01-16T07:32:36.672Z - 2021-01-16T07:53:49.618Z - 16-01-2021

అదేంటి.. అధ్యక్ష పదవి పోతే.. ఏంటి. వైట్ హౌజ్ లో ఉండకూడదా అంటే ఉండకూడదు. ఎందుకంటే.. అక్కడ కొత్త అధ్యక్షుడు వస్తాడు కదా. ఆయన ఉండేది వైట్ హౌజ్ లోనే కదా. కొత్తాయన ఉంటే ఉంటారు. లేదంటే లేదు. అదొక ఘోస్ట్ బంగ్లాగా కూడా పేరుంది. సో.. ఉండకపోవచ్చు కూడా. కానీ.. ఆ వైట్ హౌజ్ మాత్రం.. కొత్త అధ్యక్షుడి కోసం మాత్రమే కేటాయించబడుతుంది. సో.. ట్రంపు వైట్ హౌజ్ నుంచి తట్టా బుట్టా సర్దేయాలి అనేది ఫిక్స్. కానీ ఏం జరుగుతుంది. ట్రంప్ వైట్ హౌజ్ నే కాదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ ను కూడా వదిలేస్తాడట. ఏం పాపం. ఏమైంది ట్రంపుకి వాషింగ్టన్ ని వదిలేయడం ఎందుకు.. కొత్త అధ్యక్షుడు వాషింగ్టన్ లో ఉండనివ్వరా అనే డౌటేం అక్కర్లేదు. మన ట్రంపు గురించి తెలిసిందే కదా. ఇక శేష జీవితం ప్రశాంతంగా గడిపేస్తారట. అందుకే.. వాషింగ్టన్ వదిలేసి.. ఫ్లోరిడా పామ్ బీచ్ లోని తన క్లబ్ కి వెళ్తాడట ట్రంపు తాత. తన మార్ ఏ లాగో క్లబ్ లో కొత్త జీవితం ప్రారంభిస్తారట. ఇన్నాళ్లూ ఎక్కడ లేని టెన్షన్ లు ఇరిటేషన్ లు.. అందరినీ ఇరిటేట్ చేయడాలు.. ఇలా ఎన్నో ఉన్నయ్ కదా. అవన్నీ వదిలేస్తాడట ట్రంపు. అందుకే.. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజున.. ఎయిర్ ఫోర్స్ వన్ ప్రధాన కార్యాలయం జాయింట్ బేస్ ఆండ్రూస్ దగ్గర ట్రంపు కి వీడ్కోలు సభ ఉంటుంది. అది వాషింగ్టన్ బయటే ఉంది. సో.. ఎలాగూ బయటికే వస్తున్నాడు కాబట్టి.. బయటి నుంచి బయటికే వెళ్తాడట ట్రంపు. ఎలాగూ.. జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ట్రంపు రాను అన్నాడు.. బైడెన్ కూడా హమ్మయ్య రాకులే ప్రశాంతం అన్నారు కదా. మొహమాటానికి కూడా పిలవలేదాయె. అందుకే.. హర్ట్ అయినట్లున్నాడు. రాజధాని నీదే.. రాజ్యం నీదే అన్నట్లు వదిలేసి వెళ్తున్నాడు ట్రంపు. ఇక వైట్ హౌజ్ లో ముందు ముందే.. ఓ మీట్ ఏర్పాటు చేసి.. జో బైడెన్ కి ఆతిథ్యం ఇవ్వాలి అనుకున్నారట. కానీ.. దానికి ట్రంపు ఎలాగూ ఒప్పుకోడులే అని ఆపేశారట. అమెరికా చరిత్రలోనే రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంపుకి రికార్డు దక్కింది. ఎన్నో వివాదలతో అందరినీ ఇరిటేట్ చేసిన ఘనత కూడా ట్రంపుకే దక్కింది అంటూ.. అంతా ట్రోల్ చేసేస్తున్నారు. ఆ ఒక్క ఘటనతో ట్రంప్ ఏకాకి అయినట్లే.. చీత్కరిస్తున్న పౌర సమాజం

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా
an hour ago

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ
2 hours ago

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు
2 hours ago

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
14 hours ago

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్
21 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!
21 hours ago

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్
a day ago

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్లో ట్రెండింగ్
26-02-2021

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు
18 hours ago

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం
26-02-2021
ఇంకా