newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

పాపం ట్రంప్..!

14-01-202114-01-2021 07:09:55 IST
2021-01-14T01:39:55.926Z14-01-2021 2021-01-14T01:39:49.541Z - - 24-01-2021

పాపం ట్రంప్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అధికారాన్ని వీడే సమయంలో ట్రంప్ ఎక్కడ లేని చెడ్డ పేరును తెచ్చుకుంటూ ఉన్నారు. ట్రంప్ మద్దతు దారులు అమెరికాలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారనే వార్తల పట్ల అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా.. ట్రంప్ వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండడం కూడా ట్రంప్ కు శాపమై కూర్చుంది. వీలైనంత తొందరగా ట్రంప్ ను అమెరికా అధ్యక్ష పీఠం నుండి తప్పించాలని అమెరికన్ కాంగ్రెస్ భావిస్తోంది. మరోవారం రోజుల్లో అధ్యక్షపీఠం నుంచి దిగిపోనున్న సమయంలో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. దీంతో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. రెండోసారి అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోయారు.

కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి ఘటన కారణంగానే గౌరవంగా దిగిపోవాల్సిన ట్రంప్ ను ఇలా దించేయాల్సి రావడానికి కారణం అయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ గెలుపును నిర్ధారించేందుకు సమావేశమైన కేపిటల్ హిల్ భవనాన్ని చుట్టుముట్టిన ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు దీనిని అడ్డుకునే క్రమంలో హింసాత్మకంగా మారింది. నిరసనకారుల్లో నలుగురు చనిపోగా, ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ట్రంప్ మద్దతుదారులను కట్టడి చేయడానికి మొదట ఏ మాత్రం నిర్ణయాలు తీసుకోలేదు. ఒకానొక దశలో తన మద్దతుదారులను ట్రంప్ ఎంకరేజ్ చేశాడు. ట్రంప్ కావాలనే తన మద్దతుదారులను ప్రోత్సహించారంటూ ట్రంప్‌పై ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. మెజారిటీ సభ్యులు మద్దతు పలకడంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ఈ తీర్మానాన్ని సెనేట్‌కు పంపనున్నారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అనంతరం ట్రంప్‌పై విచారణ జరగనుంది. 232 ఓట్లు ట్రంప్ కు వ్యతిరేకంగా రాగా.. 197 ట్రంప్ కు మద్దతుగా వచ్చాయి. దీంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. రెండు సార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోయారు.  

ఒకే వేదికపై మోదీ-మమతా

ఒకే వేదికపై మోదీ-మమతా

   6 hours ago


రైతుల ఆందోళనలు.. తీర్మానాలు ఇక కష్టమే.. తోమర్

రైతుల ఆందోళనలు.. తీర్మానాలు ఇక కష్టమే.. తోమర్

   8 hours ago


రైతుల ఆందోళనపై ప్రభుత్వ వైఖరి భేష్.. 80 శాతం ప్రజల్లో సంతృప్తి

రైతుల ఆందోళనపై ప్రభుత్వ వైఖరి భేష్.. 80 శాతం ప్రజల్లో సంతృప్తి

   11 hours ago


వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వావలంబన.. ప్రధాని మోదీ

వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వావలంబన.. ప్రధాని మోదీ

   13 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్తగా 14,256 కరోనా కేసులు

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్తగా 14,256 కరోనా కేసులు

   14 hours ago


తాజా చర్చలూ విఫలం.. ఇక బంతి మీ కోర్టులోనే ఉందన్న కేంద్రం

తాజా చర్చలూ విఫలం.. ఇక బంతి మీ కోర్టులోనే ఉందన్న కేంద్రం

   14 hours ago


తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

   12 hours ago


మూడోసారి మోదీనే ప్రధాని.. తాజా సర్వేలో సంచలన విషయాలు

మూడోసారి మోదీనే ప్రధాని.. తాజా సర్వేలో సంచలన విషయాలు

   17 hours ago


వంద నోటుకి మూడింది.. వ‌చ్చే నెల‌లో మాయం

వంద నోటుకి మూడింది.. వ‌చ్చే నెల‌లో మాయం

   15 hours ago


భారత్ వ్యాక్సిన్ దౌత్యం... చైనాకు చెక్ చెప్పడానికేనా?

భారత్ వ్యాక్సిన్ దౌత్యం... చైనాకు చెక్ చెప్పడానికేనా?

   22-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle