newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

అమెరికాలో ఎమర్జెన్సీ... ట్రంప్ కీలకనిర్ణయం

12-01-202112-01-2021 16:50:55 IST
2021-01-12T11:20:55.452Z12-01-2021 2021-01-12T11:20:40.806Z - - 20-01-2021

అమెరికాలో ఎమర్జెన్సీ... ట్రంప్ కీలకనిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త్వరలో పదవీవిరమణ చేసి వైదొలగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్‌లో రెండు వారాల పాటు అత్యవసర పరిస్థితి విధించారు. నూతన దేశాధ్యక్షుడు జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న సందర్భంగా ముందుజాగ్రత్తల రీత్యా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

జో బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారులు ఈ వారాంతం, జనవరి 20న మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేఫథ్యంలో అప్రమత్తమైన ట్రంప్ ముందు జాగ్రత్తగా చర్యగా వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధించారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ ఆఫీస్‌ వెల్లడించింది. 

అమెరికా 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. గత వారం ట్రంప్‌ మద్దతుదారలు క్యాపిట్‌ల హిల్‌పై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని వైట్ హౌస్ ప్రకటనలో ఉంది. 

వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ట్రంప్‌ మద్దతుదారుల క్యాపిటల్‌ హిల్‌ బిల్డింగ్‌ మీద దాడి చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ట్రంప్ జాగ్రత్తపడ్డారు.

వాషింగ్టన్‌ సిటీలో మరోసారి దాడులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో క్యాపిటల్‌ సిటీలో 15 వేల మంది జాతీయ భద్రతా దళాలను అమెరికా మోహరించింది. 

వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి విధించటంతో స్థానిక జనాభాకు కలిగే కష్టాలను, బాధలను తగ్గించడం.. విపత్తు సహాయక చర్యలను సమన్వయం చేయడం.. స్టాఫోర్డ్ చట్టం టైటిల్ 5 కింద అధికారం పొందిన అవసరమైన అత్యవసర చర్యలకు తగిన సహాయం అందించడం.. ప్రాణాలను కాపాడటం, ఆస్తిని రక్షించడం, ప్రజారోగ్యం, భద్రత, విపత్తు ముప్పును తగ్గించడం, నివారించడం వంటి బాధ్యతలన్ని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఈ అత్యవసర సహాయ చర్యలకు అవసరమైన నిధులను ఫెడరల్‌ ప్రభుత్వమే 100 శాతం అందిస్తుంది. 

వాషింగ్టన్ మేయర్ మురెల్ బ్రౌజర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జోబైడెన్ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి తరలిరావద్దని అమెరికన్లకు పిలుపునిచ్చారు. నేను ఈ సందర్భంగా దేనికైనా భయపడుతున్నానంటే కారణం మన ప్రజాస్వామ్యం గురించే. ఎందుకంటే సాయుధులై ప్రమాదకరంగా కనిపిస్తున్న తీవ్రవాద ముఠాలు మన మధ్యే ఉన్నాయి. కాబట్టి అమెరికన్లు వర్చువల్ గా మాత్రమే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారాన్ని తిలకించడాన్ని మేం ప్రోత్సహిస్తాం. గత వారం క్యాపిటల్ బిల్డింగ్ ప్రాంతంలో జరిగిన హింసాకాండ తరహా ఘటన నుంచి కొలంబియా జిల్లాను కాపాడాలని అనుకుంటున్నాం అని మేయర్ బ్రౌజర్ చెప్పారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle