నా ప్రసంగంలో తప్పేముంది... ఇప్పటికీ మారని ట్రంప్
13-01-202113-01-2021 19:25:28 IST
2021-01-13T13:55:28.564Z13-01-2021 2021-01-13T13:55:25.181Z - - 17-01-2021

అమెరికా అధ్యక్షుడిగా తన చివరి రోజుల్లో అభిశంసన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ట్రంప్ ఏమాత్రం తన దూకుడును తగ్గించుకోవడం లేదు. తన మద్దతుదారులు కేపిటల్ హిల్ భవంతిపై చేసిన దాడి ఘనటలో తన పాత్ర ఏమీలేదని సమర్థించుకున్నారు. అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అమెరికా ఎన్నికల్లో నిజమైన విజేతను తానేనని, కాంగ్రెస్ సమావేశం జరిగే కేపిటల్ హిల్‌కు వెల్లువెత్తాలని చెబుతూ జనవరి 6న ట్రంప్ చేసిన ప్రసంగం తీవ్ర హింసాకాండకు దారితీసిన నేపథ్యంలో ట్రంప్‌పై అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం సిద్ధమవుతోంది. దీంతో అమెరికా చరిత్రలో రెండోసారి అభిశంసనకు గురవుతున్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ మిగిలిపోనున్నారు,. మెక్సికో సరిహద్దులోని అలామో వద్ద రక్షణ గోడను సందర్శించిన డొనాల్డ్ ట్రంప్ టెక్సాస్‌కు తిరిగి వస్తూ జనవరి 6న జరిగిన ఘటన విషయంలో తన పాత్ర ఏమీలేదని చెప్పుకున్నారు. ఆనాటి తన ప్రసంగం సరైందేనని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని చెప్పారు. డెమాక్రాట్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచిన జో బైడెన్ గెలుపును ధ్రువపర్చేందుకు అమరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశమైన కేపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడిచేసి ఆఫీసులను ధ్వంసం చేశారు. ఆ ఘటనకు తనను బాధ్యుడిగా చేస్తూ అభిశంసనకు పిలుపునివ్వడం అనేది అమెరికా రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద వేధింపుగా భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. హింసకు ఎవరైనా సరే పాల్పడకూడదని, కానీ తన మద్దతుదారులు ఆ సమయంలో ఆగ్రహంతో కంపించిపోతున్నారని, వారిలో అంత ఆగ్రహాన్ని తానెన్నడూ చూసి ఉండలేదని ట్రంప్ చెప్పారు. 2016లో తాను అధికారంలోకి రావడానికి విశేషంగా తోడ్పడిన రెండు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు ట్విట్టర్, ఫేస్బుక్ ఇప్పుడు ట్రంప్ ఖాతాలను నిషేధించడంతో తన సందేశాలను పంపడానికి కూడా ట్రంప్ ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పైగా హింసకు ప్రేరేపించేలా ట్రంప్ చేసిన ప్రసంగం బలమైన మద్దతుదారులను కూడా ట్రంప్‌కు దూరం చేసింది. డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్ ప్రతినిధులు, నేతలు, కార్పొరేట్ సంస్థల అధిపతులు కూడా ట్రంప్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ట్రంప్‌పై ఏకగ్రీవంగా అభిశంసన తీర్మానం పెట్టడానికి మంగళవారం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు వ్యతిరేకించినప్పటికీ బుధవారం మాత్రం డెమాక్రాటిక్ పార్టీ ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకుంది.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
6 hours ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
13 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
11 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
15 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
15 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
16 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
17 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
18 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
18 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా