newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

29-10-202029-10-2020 10:16:41 IST
Updated On 29-10-2020 11:22:27 ISTUpdated On 29-10-20202020-10-29T04:46:41.154Z29-10-2020 2020-10-29T04:46:36.006Z - 2020-10-29T05:52:27.335Z - 29-10-2020

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి డబ్బులిస్తం అంటోంది టీటీడీ. బుక్ చేసుకునే టైమ్ లో ఉన్న ఇంట్ర‌స్ట్ జ‌నాల‌కి ర‌ద్దు చేసుకోవ‌డంపై లేన‌ట్లే ఉంది. లాక్ డౌన్ టైమ్ లో కూడా జ‌నాలు రేపో మాపో.. ఓపెన్ చేస్తారేమో అని బుక్ చేసుకుంటూనే ఉన్నారు క‌దా. వారం వారం పోస్ట్ ఫోన్ చేస్తూ.. ఈ నెల ఆ నెల అంటూ ఉండే స‌రికి.. టిక్కెట్లు దొర‌క‌వేమో అని బుక్ చేసుకున్నారు. శ్రీవారి ఆర్జిత సేవ‌లు.. ద‌ర్శ‌నాలు.. 300 రూపాయ‌ల టిక్కెట్లు, రూమ్ లు బుక్ చేసుకున్నారు. కానీ.. ఆ టైమ్ లో టెంపుల్ ఓపెన్ చేయ‌డం, శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు రావ‌డం జ‌ర‌గ‌లేదు. సో.. అవి అలాగే ఉన్న‌య్. 

మ‌రి జ‌నాలు మ‌ర్చిపోయారో ఏమో కానీ.. బుక్ చేసుకున్న వాళ్లు లైట్ తీసుకున్నారు. మ‌రి ఆ అమౌంట్ ని శ్రీవారి హుండీలో వేసిన‌ట్లు ఫీల్ అవుతున్నారో ఏమో కానీ.. అలా పెండింగ్ లో ఉన్న‌య్. మార్చి 13 నుంచి జూన్ 30 దాకా శ్రీవారి టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. వాటిని ర‌ద్దు చేసుకుంటే డ‌బ్బులు వెన‌క్కి ఇద్దాం.. రిఫండ్ చేద్దాం అని ఆలోచిస్తోంది టీటీడీ. ఇంత‌కు ముందు కూడా ఈ అనౌన్స్ మెంట్లు చేశారు. కానీ.. జ‌నం లైట్ తీసుకున్నారు. త్వరలోనే తిరుమలలో ఉచిత దర్శనాలు

కాక‌పోతే.. ప్రాసెస్ చాలా భారీగా ఉంది. టిక్కెట్ నంబ‌ర్, బ్యాంక్ నంబ‌ర్, ఐ ఎఫ్ ఎస్ సీ కోడ్ ఎక్సెల్ ఫార్మాట్ లో.. refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలి. మ‌రి ఎక్క‌డి నుంచి బుక్ చేసుకున్నారో వారికే పంపితే పోయేదానికి టీటీడీ కూడా ఇంత ప్రాసెస్ పెట్టింది. అందుకేనేమో.. ఆ టిక్కెట్లు ఎక్క‌డున్న‌యో.. ఆ బుక్ చేసుకున్న మెస్సేజ్ లు ఇన్నాళ్లు ఉన్న‌యో లేవో.. ఈ గోల అంతా ఎందుకులే అని సైలెంట్ అయ్యారో కానీ.. మొత్తానికైతే.. ర‌ద్దు చేసుకోవ‌డంపై జ‌నంలో పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేదు. కాక‌పోతే.. ఈ డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే ఇలాంటి అవ‌కాశం ఉంది. త‌ర్వాత డ‌బ్బులు రిఫండ్ కావు. ఈ ర‌ద్దు గోల‌ని వాళ్లు కూడా వ‌చ్చే ఏడాది కంటిన్యూ చేయ‌ద‌ల్చుకోలేదు కావ‌చ్చు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle