newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

10-04-202110-04-2021 10:30:36 IST
2021-04-10T05:00:36.792Z10-04-2021 2021-04-10T04:28:15.758Z - - 15-05-2021

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏప్రిల్‌ 11 నుంచి ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్తంగా టీకా ఉత్సవం నిర్వహించాలని,  అర్హులైన వారికి పెద్ద సంఖ్యలో టీకా వేయాలని ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. కనీవినీ ఎరుగని విధంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో కోసులు లక్షకుపైగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్ నిరోధంలో రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రధాని ఆరోపించారు. ప్రమాదకరంగా మారుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.

గతంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ అనే మూడు విధానాలను సమర్థంగా అమలు చేసినందువల్లే దేశంలో క్రియాశీల సంఖ్యను పది లక్షల నుంచి 1.25 లక్షలకు గణనీయంగా తగ్గించగలిగామని ప్రధాని గుర్తు చేశారు. కేసులు ఎన్ని పెరిగినా కరోనా సెకండ్ వేవ్‌పై కచ్చితంగా విజయం సాధిస్తామని, ఎందుకంటే మన వద్ద ఇప్పుడు టీకాతోపాటు మరింత అనుభవం, మెరుగైన వసతులు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఒక వ్యక్తి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత 72 గంటల్లోపు ఆ వ్యక్తికి సంబంధించి కనీసం 30 మంది సన్నిహిత కాంటాక్టులను గుర్తించి వారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఆర్టీపీసీఐర్ టెస్టులు కనీసం 70 శాతం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు కరోనా నిబంధనలను పాటించడం లేదని, దానికి తోడు ప్రభుత్వ యంత్రాంగంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన రాత్రి కర్ఫ్యూపై జరుగుతున్న చర్చలను ప్రధాని తోసిపుచ్చారు. రాత్రి పూట మాత్రమే కరోనా ప్రభావం కలిగిస్తుందా అంటూ సాగుతున్న మేధో చర్చలను ప్రధాని తిరస్కరించారు. రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా ముప్పుపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు ప్రజల దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలగదని ప్రధాని వివరించారు. దేశంలోని పలుప్రాంతాల్లో విధిస్తున్న, అమలవుతున్న రాత్రి కర్ప్యూని ఇకనుంచి కరోనా కర్ప్యూగా పేర్కొనాలని ప్రధాని సూచించారు. నైట్‌ కర్ఫ్యూ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ప్రయోగమనీ, దాంతో ప్రజల్లో కరోనా ముప్పు తొలగిపోలేదన్న అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే, రాత్రి 9 లేదా 10 గంటలకు ప్రారంభించి ఉదయం 5 లేదా 6 గంటలకు ఈ కర్ఫ్యూని ముగిస్తే మంచిది అని మోదీ వ్యాఖ్యానించారు. 

టీకాతో పాటు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత తదితర నిబంధనలను కూడా కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు ‘మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌’ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ప్రధాని ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా టీకా తీసుకునేందుకు ప్రస్తుతం ఉన్న 45 ఏళ్ల వయో పరిమితిని 18 ఏళ్లకు తగ్గించాలని మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్న విషయం ప్రధాని ప్రస్తావించారు. అయితే టీకా ఇచ్చేందుకు నిర్ధారించిన 45 ఏళ్ల వయో పరిమితిని ప్రధాని గట్టిగా సమర్ధించారు. ఈ విషయంపై కొందరు రాజకీయం చేస్తున్నారని, ఆ వివాదంలోకి తాను దిగబోనని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిపై పోరులో కేంద్రంతో కలిసిరావాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను కోరారు. ప్రభుత్వ యంత్రాంగం తీరులో మార్పు రావాలి. ఏడాది నుంచి నిరాటంకంగా పోరాడుతుండడంతో అలసిపోయి ఉంటారు. కానీ రానున్న రెండు, మూడు వారాలు చాలా ముఖ్యం. అలసత్వం వీడి, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది అన్నారు. 

Viral Video: మాస్కు పెట్టుకోలేదని.. ఆటో డ్రైవర్ పై పోలీసుల దాష్టీకం

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle