భారత్‌లో కాలుమోపిన టెస్లా.. స్వాగతించిన ఎడ్యూరప్ప
13-01-202113-01-2021 17:09:59 IST
2021-01-13T11:39:59.481Z13-01-2021 2021-01-13T11:39:53.287Z - - 17-01-2021

అమెరికా ఎలెక్ట్రిక్ కార్ తయారీ దిగ్గజ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్‌లో కాలుమోపింది. కర్ణాటకలోని బెంగళూరులో కంపెనీ తన పేరును నమోదు చేసుకుంది. బెంగళూరులో పరిశోధనా, అభివృద్ధి విభాగాన్ని టెస్లా ఏర్పర్చనుందని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ ఎడ్యూరప్ప ఈ సందర్భంగా భారతదేశాన్ని, కర్నాటకను సందర్శించాలని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ని ఆహ్వానించారు. పర్యావరణ సహిత ప్రయాణం వైపుగా భారత జర్నీకి కర్నాటక నేతృత్వం వహించనుందని ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. బెంగళూరులో ఆర్ అండ్ డి విభాగాన్ని ఏర్పర్చడం ద్వారా త్వరలోనే టెస్లా తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, కర్నాటకకు ఎలాన్ మస్క్‌ను ఆహ్వానిస్తున్నానని ఎడ్యూరప్ప చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు మొదలెట్టడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అయిదు రాష్ట్రాలతో సంప్రదిస్తోందని సమాచారం. జనవరి 8న టెస్లా మోటార్స్ ఇండియా అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బెంగళూరులో తన రిజిస్టర్డ్ ఆపీసును తెరిచింది, బెంగళూరు ఇప్పటికే పలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్ కంపెనీలకు నిలయంగా ఉన్న విషయం తెలిసిందే. మహరాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలతో కూడా టెస్లా కంపెనీ చర్చలు సాగిస్తోందని సమాచారం. కాగా 2021లో భారతీయ మార్కెట్లోకి టెస్లా ప్రవేశిస్తోందని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ నిర్దారించారు. ఇండియా వాంట్స్ టెస్లా మెసేజ్ ఉన్న టీషర్టును ధరించి ట్విట్టర్లో సందేశం పంపిన మస్క్ వచ్చే సంవత్కరం భారత్‌లో అడుగుపెడతామని గత నెలలో చెప్పారు. భారత్‌లో టెస్లా మోడల్ 3 కార్లను ప్రవేశపెడతామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ డిసెంబర్ లోనే ప్రకటించారు. మోడల్ 3 కారు టెస్లా ఉత్పత్తి చేసే అత్యంత చవకైన కారు. దీనిధర దాదాపు 55 లక్షల రూపాయలు ఉండొచ్చని చెబుతున్నారు. జనవరిలోనే ఈ కారు బుకింగులు ఉంటాయని తెలుస్తోంది.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
5 hours ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
12 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
10 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
14 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
14 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
15 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
16 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
17 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
17 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా