newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల దాడిలో అమరులైన తెలుగు జవాన్లు

06-04-202106-04-2021 00:12:11 IST
Updated On 05-04-2021 12:00:12 ISTUpdated On 05-04-20212021-04-05T18:42:11.112Z05-04-2021 2021-04-05T06:12:20.404Z - 2021-04-05T06:30:12.247Z - 05-04-2021

ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల దాడిలో అమరులైన తెలుగు జవాన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే..! ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రతా బలగాలపై పక్కా వ్యూహంతో భారీ దాడి చేశారు. బీజాపూర్ అడవుల్లో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కూబింగ్‌కు వెళ్తున్న 660 మంది జవాన్లపై మావోయిస్టులు లాంచర్లతో దాడి చేశారు.

భద్రతా దళాలను మావోయిస్టులు తీవ్రంగా దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్లో 22 మంది భద్రతా సిబ్బంది, ఒక మహిళా మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ లేకుండా పోయిన భద్రతా సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. టర్రెం అటవీ ప్రాంతానికి పెద్ద ఎత్తున అదనపు బలగాలను తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బీజాపూర్ పోలీసులు చెప్తున్నారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, గాయపడిన 24 మంది జవాన్లను బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనలో ఇద్దరు తెలుగు జవాన్లు అమరులయ్యారు. విజయనగరం గాజులరేగ ఎగువవీధికి చెందిన రౌతు సింహాచలం, రమణమ్మల కుమారుడు జగదీష్ సీఆర్‌పీఎఫ్‌ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు వదిలారు. ఆయన మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మే 22న జగదీష్‌కు వివాహం నిర్ణయించారు.. ఈ నెల 5న పెళ్లి పనులు చూసుకునేందుకు ఇంటికి రావాలనుకున్నానని.. రెండురోజల కిందటే తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పాడు. కానీ జగదీష్ ఇంతలోనే ప్రాణాలను కోల్పోయారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండర్‌ శాఖమూరి మురళీకృష్ణ ఈ ఘటనలో అసువులు బాసారు. రవి, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు.. వారిలో మురళీకృష్ణ 2010లో సీఆర్‌పీఎఫ్‌కు ఎంపికయ్యాడు. ఆయనకు పెళ్లి చేయాలని ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. ఈ వేసవిలో పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. 2 నెలల క్రితం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఈసారి పెళ్లి చేసుకునేందుకు వస్తానని బంధువులు, స్నేహితులకు చెప్పాడట.. ఇప్పుడు ఇలా జరిగింది అని వారందరూ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. 

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   10 hours ago

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   14 hours ago

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   16 hours ago

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   15-04-2021

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   19 hours ago

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle