newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

ఈ నెల 12న ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానల్స్‌ ప్రారంభం

08-10-202108-10-2021 08:29:19 IST
2021-10-08T02:59:19.632Z08-10-2021 2021-10-08T02:59:12.646Z - - 07-12-2021

ఈ నెల 12న ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానల్స్‌ ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మరో రెండు భాషలలో అందుబాటులోకి రానుంది. ఈ నెల 12వ తేదీన ఎపి సీఎం వైఎస్ జగన్ ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్ లని ప్రారంభిస్తారు. 

సీఎం జగన్ ఈనెల 11, 12 తేదీల్లో తిరుపతి పర్యటనకు విచ్చేయనున్నారు. 11వ తేదీ మధ్యాహ్నం 2.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి బర్డ్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవం, అలిపిరి శ్రీవారి పాదాల వద్ద పైకప్పు నిర్మాణ పనులు, పాదాల మండపం వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరం ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం తిరుమలలో శిరోవస్త్రం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

 

రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బసచేస్తారు. ఇక 12వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఎస్వీబీసీ (కన్నడ, హిందీ) చానల్స్‌ను, రూ.12కోట్లతో ఆధునీకరించిన బూందీ పోటును ప్రారంభిస్తారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు కలిగిన వెంకటేశ్వర స్వామివారి తిరుమల సమాచారాన్ని ఇప్పటి వరకు ఒకే ఛానల్ లో తెలుగు, హిందీ, కన్నడ భాషలు వచ్చేవి. ఇప్పుడు కన్నడ, హిందీ ప్రత్యేక ఛానల్ లు ఏర్పాటు చేయడంతో భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముంబైలోని జల్లెడ పడుతున్న అధికారులు.. 100 మంది ప్రయాణికుల జాడ తెలియలేదు

ముంబైలోని జల్లెడ పడుతున్న అధికారులు.. 100 మంది ప్రయాణికుల జాడ తెలియలేదు

   6 hours ago


మధ్యప్రదేశ్ లో మత మార్పిడికి పాల్పడిందని పాఠశాలపై దాడి

మధ్యప్రదేశ్ లో మత మార్పిడికి పాల్పడిందని పాఠశాలపై దాడి

   7 hours ago


నాగాలాండ్ మరణాలపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తుంది: అమిత్ షా

నాగాలాండ్ మరణాలపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తుంది: అమిత్ షా

   a day ago


దేశంలో 21 ఒమిక్రాన్ కేసులు నమోదు, రాజస్థాన్‌లో ఎక్కువ

దేశంలో 21 ఒమిక్రాన్ కేసులు నమోదు, రాజస్థాన్‌లో ఎక్కువ

   06-12-2021


నాగాలాండ్‌లో ఘోరం: నక్సల్స్ అనుకుని భద్రతా దళం గ్రామస్తులపై దాడి.. 13 మంది మృతి

నాగాలాండ్‌లో ఘోరం: నక్సల్స్ అనుకుని భద్రతా దళం గ్రామస్తులపై దాడి.. 13 మంది మృతి

   05-12-2021


దేశంలో 3వ ఒమిక్రాన్ కేసు నమోదు.. జింబాబ్వే నుండి గుజరాత్‌కు వచ్చింది వ్యక్తికి పాజిటివ్

దేశంలో 3వ ఒమిక్రాన్ కేసు నమోదు.. జింబాబ్వే నుండి గుజరాత్‌కు వచ్చింది వ్యక్తికి పాజిటివ్

   04-12-2021


పిల్లలకు బూస్టర్ డోస్, వ్యాక్సిన్ లపై నిపుణుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం

పిల్లలకు బూస్టర్ డోస్, వ్యాక్సిన్ లపై నిపుణుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం

   04-12-2021


బెంగళూరులో ఒమిక్రాన్ వచ్చింది ఒక వైద్యుడుకి..

బెంగళూరులో ఒమిక్రాన్ వచ్చింది ఒక వైద్యుడుకి..

   03-12-2021


ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

   02-12-2021


కోవిడ్-19 ఓమిక్రాన్ 15 దేశాలకు విస్తరించింది

కోవిడ్-19 ఓమిక్రాన్ 15 దేశాలకు విస్తరించింది

   02-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle