మీ వల్లే కోవిడ్ రోగులను దూరం పెడుతున్నారు.. సుప్రీం వ్యాఖ్య
02-12-202002-12-2020 12:42:08 IST
2020-12-02T07:12:08.360Z02-12-2020 2020-12-02T07:12:05.795Z - - 28-01-2021

కరోనా వైరస్ బారినపడిన బాధితుల ఇళ్ల వద్ద అధికారులు పోస్టర్లు అంటిస్తుండటంతో ప్రజలు వారిని అంటరానివారిగా చూస్తున్నారనీ, క్షేత్ర స్థాయి పరిస్థితికి ఇది అద్దం పడుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన వారి పేర్లను బహిరంగ పరచడం, వారి ఇళ్ల వద్ద పోస్టర్లు అంటించడం వంటి చర్యల కారణంగా వ్యాధి బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రంటూ కుష్ కల్రా అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనంపై విధంగా స్పందించింది. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వారు, ఐసోలేషన్ ఉన్న వారి ఇళ్ల పోస్టర్లు వేయడం ఆపేయాలంటూ యంత్రాంగాన్ని ఆదేశిస్తామంటూ ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 3వ తేదీన హైకోర్టులో అంగీకరించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఇదే విధమైన నిబంధన అమలయ్యేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం జారీ చేసిన నిబంధనావళిలో పోస్టర్లు వేయడం అనేది లేదు. కానీ, కొన్ని రాష్ట్రాలు కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కరోనా వైరస్ బాధితుల ఇళ్లవద్ద పోస్టర్లు అంటిస్తున్నాయి అంటూ కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనను తోసిపుచ్చింది. ఇలాంటి చర్యల వల్ల బాధితుల పట్ల చుట్టుపక్కల వారు వివక్ష చూపడం వంటివి జరుగుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

భారత్‌తో అమెరికా సంప్రదింపులు.. సహకారానికి ఒకే
38 minutes ago

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్
3 hours ago

పెట్రోల్ రేట్.. కనీవినీ ఎరుగని అద్భుతం
4 hours ago

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా
6 hours ago

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'కు మూడోస్థానం
7 hours ago

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత
8 hours ago

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం
9 hours ago

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!
20 hours ago

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా
27-01-2021
ఇంకా