newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేటినుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ... అదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు

06-04-202106-04-2021 16:15:33 IST
2021-04-06T10:45:33.767Z06-04-2021 2021-04-06T10:45:31.315Z - - 16-04-2021

నేటినుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ... అదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్న మహారాష్ట్ర.. నేడు ఢిల్లీ.. దేశంలోని ప్రతి రాష్ట్రం మెల్లగా లాక్ డౌన్ పరిస్తితుల్లోకి వెళ్లిపోతోంది. మహారాష్ట్రలో వారాంతపు రోజుల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించి, మామూలు రోజుల్లో పరిమిత లాక్ డౌన్ విధించి 24 గంటలు కాక ముందే ఢిల్లీ కూడా ఆమార్గంలోనే నడిచింది. దేశరాజధాని డిల్లీలో రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో మంగళవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. 

మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు ఢిల్లీ వ్యాప్తంగా రాత్రి 10 గంటలనుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ప్యూ విధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరాలు, వాక్సినేషన్ కోసం ప్రయాణాలు చేసేవారికి ఈ పాసులు జారీ చేస్తామని, కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో వారికి మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వాధికారులు తెలిపారు. అలాగే జర్నలిస్టులు, ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా అనుమతిస్తామని పేర్కొన్నారు. 

మార్చినెలలో దేశరాజధానిలో ఉన్నట్లుండి కరోనా వైరస్ తాకిడి ప్రారంభమైన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న అతి కఠిన నిర్ణయమిది. ఢిల్లీ నాలుగో దశ కోవిడ్-19ని ఎదుర్కొంటోందని అయితే లాక్ డౌన్ విధించాలని అనుకోవడం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత శుక్రవారమే ప్రకటించినవిషయం తెలిసిందే. కానీ మూడు రోజుల వ్యవధిలోనే రాజధాని వ్యాప్తంగా రాత్రిపూట కర్ప్యూ విధిస్తూ కే్జ్రీవాల్ ప్రకటించాల్సి వచ్చింది.

ఢిల్లీలో సోమవారం కొత్తగా 3548 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.

ప్రజల రాకపోకలను అడ్డుకోవడానికే రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నాం తప్ప నిత్యావసర సేవలను అడ్డుకోబోమని, అలాగే ట్రాఫిక్ కదలికలను కూడా నిలవరించమని ఢిల్లీ ప్రభుత్వాధికారులు తెలిపారు.

మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాత్రి పూట 8 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ప్యూని విధించాయి. సోమవారం నాటికి దేశంలో కరోనా కేసులు లక్షకుపైగా దాటాయి. భారతదశంలో ఈ స్థాయిలో కరోనా వైరస్ విజృంభించడం ఇదే తొలిసారి.

అలాగే ఒడిషా, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్.. రాత్రి పూట కర్ప్యూని విధించాయి. అంటే కరోనా వైరస్ వ్యాప్తి ప్రబలిన రాష్ట్రాలన్నీ మెల్లమెల్లగా లాక్ డౌన్ పరిధిలోకి వెళుతున్నట్లే లెక్క.

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   11 hours ago

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   15 hours ago

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   17 hours ago

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   15-04-2021

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   20 hours ago

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle