newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

13-05-202113-05-2021 14:53:18 IST
Updated On 13-05-2021 14:52:58 ISTUpdated On 13-05-20212021-05-13T09:23:18.130Z13-05-2021 2021-05-13T09:18:04.338Z - 2021-05-13T09:22:58.743Z - 13-05-2021

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం విఫలమైందంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, మేధావులు అరుదైన కళాఖండాలు కలిగిన మ్యూజియంల నిపుణులు కూడా మోడీ సర్కార్ పై ధ్వజమెత్తుతున్నారు. వీరి ఆవేదనకు, ఆక్రోశానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తలపెట్టిన సెంట్రల్ విస్టా నిర్మాణ కార్యక్రమమే. ఇటు వ్యాక్సిన్లకు, అటు ఆక్సిజన్ కు  నిధులు లేక విలవిల లాడుతున్న సమయంలో ఇంత ఖర్చుతో ఈ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. దీని నిర్మాణం అనుకున్నంత తేలికేమీ కాదని, జాతీయ మ్యూజియం, జాతీయ పురావస్తు భవనాలు, అలాగే ఐజిఎంసిఏ లో ఉన్న అత్యంత అరుదైన కళాఖండాలను, చారిత్రక వస్తువులను సురక్షితంగా బాధ్యతాయుతంగా తరలించడం అన్నది ఓ పెద్ద సవాలేనని అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన 75 మంది తమ ఉమ్మడి ప్రకటనలో స్పష్టం చేశారు. వెంటనే దీనికి స్వస్తి పలకాలని ప్రస్తుత కోవిడ్ తీవ్రత సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెనక్కు తగ్గాలని డిమాండ్ చేశారు.   

దీని నిర్మాణంలో భాగంగా అనేక ఆరుదైన  భవనాలను కూల్చివేయాల్సి వస్తోందని వీటిలో నేషనల్ మ్యూజియం లాంటి సాంస్కృతికంగా ఎంతో విలువైనవి ఉన్నాయిని వీరు తెలిపారు. భారత సాంస్కృతిక, చారిత్రక రీతులకు సాక్షీభూతాలుగా నిలిచిన వీటి కూల్చివేతపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సిందేనని వారు స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఈ సెంట్రల్ విస్టా నిర్మాణ కార్యక్రమం మొదలైంది. అత్యవసర సర్వీసు ప్రాతిపదికన దీని నిర్మాణం చేపట్టడంలో గల ఔచిత్యాన్ని మేధావులు, కళాకారులు ప్రశ్నించారు. కోవిడ్ బారిన పడి  లక్షలాదిగా ప్రాణాలు కోల్పోతున్న వారిని రక్షించాల్సింది పోయి ఈ సమయంలో కూడా అరుదైన వనరులను వృధా చేయడం ఎంతమేరకు సమంజసమని వీరు ప్రశ్నించారు.   

ఈ సమయంలో కూడా దీని నిర్మాణాన్ని  నిరాటంకంగా కొనసాగించడం వల్ల  వైరస్ ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇన్ని అరుదైన కట్టడాలు  ఢిల్లీ ఒకేచోట ఉండటం వెనుక ఓ అర్ధం ఉందన్న వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని తెలిపారు. ఎంతో విలువ కలిగిన జాతీయ మ్యూజియాన్ని  పునరుద్ధరించాల్సిన అవసరం ఉందే తప్ప కూల్చేయవలసిన అగత్యం ఎంతమాత్రం లేదని తెలిపారు. హడావిడిగా జరుగుతున్న ఈ కూల్చివేతల వల్ల  ఎన్నో దశాబ్దాలుగా కష్టనష్టాలకు ఓర్చి నిర్మించుకున్న సౌధాలు మటుమాయం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూల్చివేత వల్ల  భారతీయ వారసత్వ సంపద కూడా నేలమట్టం అవుతోందని, అనేక వస్తువుల పరిరక్షణ పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారన్నారు. ప్రస్తుతం భారత్ ను అలుముకున్న ఆరోగ్య సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును ఆపాలని,  ఆర్ధిక వనరులన్నింటిని కోవిడ్ పోరాటం వైపు మళ్లించాలని డిమాండ్ చేశారు. 

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   6 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle