newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

21-09-202121-09-2021 09:03:18 IST
2021-09-21T03:33:18.666Z21-09-2021 2021-09-21T03:33:09.796Z - - 17-10-2021

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతామంటూ రెండు వేర్వేరు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ తాను వాటిని తిరస్కరించానని, రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధం కాకపోవడంతోనే ఇలా చేసానని రియల్ హీరో సోనూసూద్ స్పష్టం చేశారు. సోనూసూద్ నివాసాలపై నాలుగు రోజులు ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. సోనూసూద్‌తోపాటు ఆయన అనుచరులు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) ఆరోపిస్తున్న నేపధ్యంలో సోనూసూద్‌ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు గతవారం సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం సోనూసూద్ తొలిసారిగా ప్రకటన విడుదల చేశారు. ‘కొందరు అతిథుల’ సేవలో తీరిక లేకుండా ఉన్నానని, అందుకే గత నాలుగు రోజులుగా ప్రజలకు సేవ చేయలేకపోయానని వివరించారు. 

నా సేవా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. ఆపడానికి కాదు ప్రారంభించింది. ఇది ఆరంభం మాత్రమే.. అని సోనూసూద్‌ స్పష్టం చేశారు. సూద్‌ చారిటీ ఫౌండేషన్లో ఉన్న ప్రతి రూపాయిని ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ఆపన్నులను ఆదుకోవడానికే ఖర్చు చేస్తానని సోనూసూద్‌ తేల్చిచెప్పారు. నా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల్లో ఇంకా చదవని మెసేజ్‌లు 54,000 ఉన్నాయి. సాయం కోసం ఎంతోమంది అర్థిస్తున్నారు. రూ.18 కోట్లు ఖర్చు చేయాలనుకుంటే 18 గంటలు కూడా పట్టదు. కానీ, ప్రతి పైసా సరైన విధంగా, అర్హులైన వారి కోసమే ఖర్చు పెట్టాలన్నదే నా ఆలోచన.  సోనూ సూద్‌ రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సోదాల్లో గుర్తించామని ఐటి అధికారులు ప్రకటించిన నేపధ్యంలో సోనూసూద్ పై విధంగా స్పందించారు. కాగా సోనూ సూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి పని చేస్తున్నందుకు కక్షకట్టి కేంద్రంలోని అధికార బిజెపి సోనూసూద్ నివాసాలపై ఐటి దాడులు నిర్వహిస్తుందని సోనూసూద్ మద్దతు దారులు మండిపడుతున్నారు. 

 

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకలలో హింస.. 3 మృతి, 60 మంది గాయాలు

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకలలో హింస.. 3 మృతి, 60 మంది గాయాలు

   15-10-2021


J&K లో కౌంటర్-టెర్రర్ ఎటాక్ లో ఆర్మీ ఆఫీసర్, సైనికుడు మరణించారు

J&K లో కౌంటర్-టెర్రర్ ఎటాక్ లో ఆర్మీ ఆఫీసర్, సైనికుడు మరణించారు

   15-10-2021


ఆ మూడు రాష్ట్రాల సరిహద్దులు 50 కి.మీ.ల మేర BSF పరిధిలోకి...

ఆ మూడు రాష్ట్రాల సరిహద్దులు 50 కి.మీ.ల మేర BSF పరిధిలోకి...

   14-10-2021


షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన

   14-10-2021


ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి మూలంగా మారకుండా నిరోధించండి: G20 సమావేశంలో ప్రధాని మోడీ

ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి మూలంగా మారకుండా నిరోధించండి: G20 సమావేశంలో ప్రధాని మోడీ

   13-10-2021


దేశంలో బొగ్గు సంక్షోభం.. రాష్ట్రాల నుంచి లేఖలు

దేశంలో బొగ్గు సంక్షోభం.. రాష్ట్రాల నుంచి లేఖలు

   12-10-2021


రానున్న రోజుల్లో చీకటిలోకి ఇండియా..

రానున్న రోజుల్లో చీకటిలోకి ఇండియా..

   12-10-2021


ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

   11-10-2021


జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ఆఫీసర్, 4 మంది సైనికులు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ఆఫీసర్, 4 మంది సైనికులు మరణించారు

   11-10-2021


ఎయిర్ ఇండియా ని టాటా సన్స్ 18,000 కోట్లకు గెలుచుకుంది

ఎయిర్ ఇండియా ని టాటా సన్స్ 18,000 కోట్లకు గెలుచుకుంది

   08-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle