newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

వ్యాక్సిన్ ధరల్లో ఇంత తేడానా? మోడీకి సోనియా లేఖ

22-04-202122-04-2021 16:01:22 IST
2021-04-22T10:31:22.347Z22-04-2021 2021-04-22T10:31:11.325Z - - 14-06-2021

వ్యాక్సిన్ ధరల్లో ఇంత తేడానా? మోడీకి సోనియా లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్ వైరస్ కోరల్లో చిక్కుకున్న ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి గురువారం లేఖ రాశారు. ఓ పక్క ప్రజలు ఆర్ధిక అవస్థల్లో ఉన్నప్పుడు వ్యాక్సిన్ ధరల విషయంలో లాభాల యావ ఏమిటని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రానికి, రాష్ట్రాలకు ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్ రేట్లలో ఇంత తేడా ఏమిటని, ఇలాంటి పరిస్థితిల్లో కూడా లాభాలు ఆర్జించాలని అనుకోవడం అమానుషమని సోనియా అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ధరలను ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించిన కేంద్ర విధానాన్ని పునర్ మదింపు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. 

ప్రజలందరికీ టీకాలు వేయడానికి వీలుగా వయో పరిమితి నిబంధన తొలగించాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వికేంద్రీకరించాలని రాష్ట్రాలు కోరిన నేపథ్యంలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయవచ్చునంటూ ఇటీవల ప్రకటించిన కేంద్రం ఈ మందులను మార్కెట్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ సీరం సంస్థ ఈ మందుల రేట్లకు సంబంధించిన జాబితాను విడుదల చేసిన విషయాన్ని సోనియా గాంధీ తన లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వానికి డోసుకు 150 రూపాయలు, రాష్ట్రాలకు 450 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయల రేటును ఈ సంస్థ నిర్ణయించింది. 

"దీన్నిబట్టి చూస్తే టీకాలు వేయించుకోవాలంటే పౌరులు తప్పనిసరిగా అధిక మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. అంతే కాదు రాష్ర ప్రభుత్వాల ఆర్ధిక వనరులు కూడా హరించుకు పోతాయి " అని సోనియా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన దోపిడీని ఎలా అనుమతిస్తుంది సోనియా ప్రశ్నించారు. వైద్య సౌకర్యాలు అరకొరగా ఉన్నాయని, ఆసుపత్రులలో పడకలు లభించడం లేదని, ఆక్సిజన్ సరఫరాతో పాటు అత్యవసర మందులు కూడా హరించుకుపోతున్నాయని ఇలాంటి ఆపద సమయంలో కూడా ఈ దోపిడీ విధానం ఏమిటని ఆమె కేంద్రాన్ని నిలదీశారు.   

మొత్తం దేశానికి అంతటికీ "ఒకే జాతి ... ఒకే ధర " విధానంతో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఒకే కంపెనీ ఉత్పత్తి చేసే ధరల్లో మూడు రకాల తేడాలు ఏమిటని, ఇది పూర్తిగా విచక్షణా రాహిత్యంగా ఆలోచన అని సోనియా విమర్శించారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు ప్రజలకు ఉచితంగా టీకాలు వేయాల్సిన తన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వదిలించుకుందని సోనియా ధ్వజమెత్తారు. దీన్ని బట్టి చూస్తే యువత ఆరోగ్యం పట్ల తన జవాబుదారీతనాన్ని కూడా కేంద్రం వదలుకున్నట్లు స్పష్టమవుతోందని సోనియా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పట్ల పారదర్శకత, సమానత్వాన్ని కేంద్రం పాటించాలని సహకార సమాఖ్య స్పూర్తితో వ్యవహరించాలని సోనియా తన లేఖలో కోరారు.   

లాక్ డౌన్ అంతిమ ఆయుధమే.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle