newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

దేశం కుంగిపోతోంది... వ్యాక్సిన్ విధానం విఫలం : మోడీకి సోనియా చురక

07-05-202107-05-2021 16:46:07 IST
Updated On 08-05-2021 07:30:02 ISTUpdated On 08-05-20212021-05-07T11:16:07.781Z07-05-2021 2021-05-07T11:15:23.699Z - 2021-05-08T02:00:02.701Z - 08-05-2021

దేశం కుంగిపోతోంది... వ్యాక్సిన్ విధానం విఫలం : మోడీకి సోనియా చురక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యవస్థ కాదని, మోడీ సర్కారేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  దేశానికి ఎన్నో శక్తి సామర్ధ్యాలు ఉన్నా, సాంకేతిక, ఆర్ధిక సంపత్తి పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకోవడంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆమె ధ్వజమెత్తారు. దేశంలో కోవిడ్  వైరస్ కేసులు భయానక పరిస్థితులను సృష్టించిన నేపథ్యంలో మాట్లాడిన సోనియా కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేకపోయిందని మండిపడ్డారు. దేశీయ వనరులను సద్వినియోగం చేసుకొని ఉంది ఉంటె ఈ స్థితి, దుస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు.

ఏ విధంగా ముందుకు వెళ్లాలో మోడీ ప్రభుత్వానికి ఎన్నో సలహాలు ఇచ్చామని, వాటన్నింటిని పెడచెవిన పెట్టారని సోనియా గుర్తుచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన విజ్ఞతాయుత సలహాను కూడా మోడీ పక్కన పెట్టారని, ఆయన తోచిన రీతిలోనే వ్యవహరించారని సోనియా తెలిపారు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వర్కింగ్ కమిటీలో విశ్లేషించి తగు దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని సోనియా వెల్లడించారు. ఎవరు ఎంతగా చెప్పినా మోడీ సర్కార్ ఏ మాత్రం వినడం లేదని, మీరు మాకు చెప్పేది ఏమిటన్న రీతిలోనే వ్యవహరిస్తోందని అన్నారు.

తాము సూచనలు, ఇచ్చిన సలహాలకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, అన్ని పరిష్కారాలు తమ వద్దే ఉన్నాయన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె దుయ్యబట్టారు. ప్రస్తుతం భారతదేశం ఓ మాహా విలయాన్ని ఎదుర్కొంటోందని చెప్పిన సోనియా "ఇప్పుడు పోరాటం మీకు మాకు కాదు. మనకు కరోనాకు మధ్యే ఉండాలి" అని హితవు పలికారు. స్థాయీ కమిటీల సమావేశం తక్షణం జరగాలని, పరిస్థితిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని కేంద్రానికి సూచించారు.

ఇంతటి మాహా విపత్తును ఎదుర్కోవడానికి సమర్థులైన, విశాల దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమన్నారు. "మోడీ ప్రభుత్వ అసమర్ధత, అనాలోచిత నిర్ణయాల వల్ల  దేశం కుంగిపోతోందని" పేర్కొన్న సోనియా ప్రతి ఒక్కరూ ఉక్కు సంకల్పంతో ప్రజా సేవకు ముందుకు రావాలని, ఈ మహమ్మారి నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి చేతులు కలపాలని అన్నారు.   

కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ విధానమే లోపభూయిష్టమని దుయ్యబట్టిన సోనియా "అందరికీ ఉచిత వ్యాక్సిన్ అంటూ బడ్జెట్ లో 35వేల కోట్లు కేటాయించారు, కానీ ఇప్పుడు ఉచిత వ్యాక్సిన్ భారాన్ని రాష్ట్రాల నెత్తినే పడేశారు" అని సోనియా మండిపడ్డారు. రాష్ట్రాల పరిస్థితి ఘోరంగా మారిందని,  టీకాలను సమకూర్చుకోలేక తీవ్ర వత్తిళ్ళను ఎదుర్కొంటున్నాయని సోనియా అన్నారు. ఇప్పుడు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, పేదలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ అందకపోవడానికి కారణం మోడీ తప్పుడు విధానమేనని తప్పుబట్టారు. మోడీ సర్కార్ తన నైతిక బాధ్యతను విస్మరించడం దిగ్బ్రాంతి కలిగిస్తోందని,  ప్రజాసేవకు అంకితమవుతామని చేసిన ప్రమాణం నీరుగారిపోయిందన్నారు.  

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   an hour ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   9 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle