newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

అయ్య‌ప్ప ద‌గ్గ‌రికి వెళ్ల‌కుంటేనే మంచిదేమో

17-10-202017-10-2020 19:45:49 IST
Updated On 18-10-2020 08:53:07 ISTUpdated On 18-10-20202020-10-17T14:15:49.349Z17-10-2020 2020-10-17T14:15:07.492Z - 2020-10-18T03:23:07.644Z - 18-10-2020

అయ్య‌ప్ప ద‌గ్గ‌రికి వెళ్ల‌కుంటేనే మంచిదేమో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌నంలో కూడా మార్పు వ‌చ్చింది. ఇందుగ‌ల‌డు అందులేడ‌ని సందేహం వ‌ల‌దు వ‌ల‌దు అంటున్నారు. దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు.. అక్క‌డే ఉంటాడు.. ఇక్క‌డే ఉన్నాడు అనుకోవ‌డం క‌రెక్ట్ కాదు.. మ‌న మ‌న‌సులో కూడా ఉన్నాడు నిండు మ‌న‌సుతో త‌లుచుకుంటే చాలు అనుకుంటున్నారు భ‌క్తులు. నిజ‌మే. న‌మ్మిన దేవుడ్ని నిండు మ‌న‌సుతో త‌ల‌చుకుని పూజ‌లు చేసుకుంటున్నారు. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి విష‌యంలో ఇదే క‌నిపిస్తోంది. శ‌బ‌రిమ‌ల‌లో అధికారులు ఊహించిన దానికంటే త‌క్కువ రెస్పాన్స్ వ‌స్తోందంట‌. 

మామూలు రోజుల్లో 1000 మందికి , వీకెండ్స్ లో రెండు వేల మంది భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం అవ‌కాశం క‌ల్పిస్తున్నాం.. అంద‌రూ వ‌ర్చువ‌ల్ పోర్ట‌ల్ క్యూలో బుక్ చేసుకోవాలి అన్నారు ఆఫీస‌ర్లు. కానీ.. ఆ క్యూలో 260 మందే ఉన్నార‌ట‌. దీనిపై అధికారులు కూడా కాస్త షాక్ అయ్యార‌ట‌. అందుకే.. 250 మందికే అవ‌కాశం ఇస్తూ మ‌ళ్లీ రూల్ పాస్ చేశారు. ఇక మీద‌ట రోజూ 250 మందికి మాత్ర‌మే వ‌ర్చువ‌ల్ పోర్టల్ లో ద‌ర్శ‌నం బుక్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌న భాగ్యం 250 మందికి మాత్ర‌మే దొరుకుతుంది.

ఇక కేర‌ళ‌లో మ‌ళ్లీ క‌రోనా పెరుగుతోంది. అందుకే.. అక్క‌డి అధికారులు జ‌నాలు కూడా భ‌య‌ప‌డుతూనే ఉన్నారు. బ‌య‌టి నుంచి వెళ్లే వాళ్లు కూడా అదే ఫీల్ లో ఉన్నారు. అన్నీటికీ ఆ దేవుడే ఉన్నాడు అని వెళ్లే వాళ్లేమో వెళ్తున్నారు. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎలా అనే వాళ్లేమో ఆగుతున్నారు. కేర‌ళ సిచ్చువేష‌న్, క‌రోనా కేసుల లెక్క‌లు చూసిన జ‌నాలు మాత్రం.. కొన్నాళ్లు ఆగుదాం.. దేవుడికి త‌ర్వాత ప్ర‌త్యేక పూజ‌లు చేద్దాం అని ఆలోచిస్తున్నార‌ట‌. 

ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   an hour ago


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   2 hours ago


త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

   19 hours ago


భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

   19 hours ago


కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్

కరోనా కేసుల అప్డేట్

   a day ago


అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

   28-10-2020


హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

   28-10-2020


కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

   27-10-2020


కరోనా కేసుల అప్డేట్.. 80 లక్షలకు చేరువలో

కరోనా కేసుల అప్డేట్.. 80 లక్షలకు చేరువలో

   27-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle