newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేనొక్కణ్ణే ఏం చేయగలను.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిపై సీరం సిఈఓ

02-05-202102-05-2021 09:52:02 IST
Updated On 02-05-2021 10:02:47 ISTUpdated On 02-05-20212021-05-02T04:22:02.592Z02-05-2021 2021-05-02T04:21:58.879Z - 2021-05-02T04:32:47.253Z - 02-05-2021

నేనొక్కణ్ణే ఏం చేయగలను.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిపై సీరం సిఈఓ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: భారత్ లో ఎక్కడ చూసినా కరోనా వైరస్ కలకలమే. ఆక్సిజన్ లేక పడకలు అంతటా మరణ మృదంగమే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత కూడా వైరస్ తీవ్రతను మరింత పెంచింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు రెండు రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఒకటి కోవిషీల్డ్ కాగా రెండవది కొవాక్సీన్. కోవిషిల్డ్ వ్యాక్సిన్ ను పూణేలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు దేశమంతా కోవిషిల్డ్ తప్ప మరో వ్యాక్సిన్ అందుబాటులో లేని పరిస్థితి. దాదాపు కోటానుకోట్ల మందికి ఒకే సంస్థ వ్యాక్సిన్ ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇదే మాటను సీరం సంస్థ సిఈఓ ఆధార్ పూనావాలా అంటున్నారు.

"అంతా నా భుజాల మీదే పడేస్తే నేను మాత్రం ఏం చేయగలుగుతాను అందరికీ వ్యాక్సిన్ అందించడం నా ఒక్కడితో అవుతుందా " అని  పూనా వాలా అన్నారు. లండన్ లో ఉంటున్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ వెళ్ళలేనని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్ లో రెండవ దశ వైరస్ అత్యంత తీవ్రంగా మారినందున కోవిడ్ వ్యాక్సిన్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. తనపై తట్టుకోలేనంత వత్తిడి వస్తోందని ఆయన తెలిపారు. తనకు వై కేటగిరీ భద్రతను భారత ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో మాట్లాడిన ఆయన భారత్ లోని అనేక మంది ప్రముఖ నేతల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని అన్నారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరాలను పెంచాలన్న డిమాండ్ తీవ్రమవుతోంది అన్నారు. ఈ వత్తిడి తట్టుకోలేకే తాను లండన్ వచ్చేశానని భార్యా పిల్లలతో ఉంటున్నానని తెలిపారు. అంతా తనమీదే వేసేస్తే తాను మాత్రం ఏం చేయగలుగుతానని అన్నారు. "అందరి అవసరాలు తీర్చే బాధ్యత తన మీదే పడేస్తే తనకు ఎలా సాధ్యమవుతుందని" ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు ఊహించని రీతిలో ఈ డిమాండ్ రోజురోజుకూ పెరిగి పోతోందని, అంతా తానే  చేయాలంటే తన పరిస్థితి కూడా అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

తాను లండన్ రావడానికి కారణం కోవి షీల్డ్ ఉత్పత్తిని పెంచి భారత్ తో పాటు ఇతర దేశాలకు అందించాలన్నదేనని ఆయన తెలిపారు. భారత్ లోనే కాకుండా బ్రిటన్ నుంచి కూడా ఈ వ్యాక్సిన్  ఉత్పత్తి చేయబోతున్నారా అన్న ప్రశ్నకు "మరికొన్ని రోజుల్లోనే ప్రకటన చేస్తానని" అన్నారు. ప్రస్తుతం  కోవి  షీల్డ్ వార్షిక ఉత్పత్తిని సీరం సంస్థ 150 కోట్ల డోసుల నుండి 250 కోట్ల డోసులకు పెంచింది. దీని మొత్తం వ్యయం 800 మిలియన్ డాలర్లు. కోవిడ్ రెండవ దశ వరకు భారత్ లో పరిస్థితి మామూలుగా ఉండటం బ్రిటన్ సహా 68 దేశాలకు ఈ వ్యాక్సిన్ ను ఎగుమతి చేసింది. కానీ ఒక్కసారిగా పరిస్థితి తారుమారైందని, ఆ దేవుడు కూడా ఈ దుస్థితిని ఊహించి ఉండడని తెలిపారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రేటు పెరిగినా కూడా ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలో అత్యంత చౌకైన మందు ఇదేనని, దీని విక్రయంలో లాభాపేక్ష ఏమి లేదని తెలిపారు.  

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   2 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   2 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   12 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   19 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   19 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   18 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle