newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

28-10-202028-10-2020 15:14:04 IST
Updated On 28-10-2020 15:27:20 ISTUpdated On 28-10-20202020-10-28T09:44:04.239Z28-10-2020 2020-10-28T09:44:00.623Z - 2020-10-28T09:57:20.219Z - 28-10-2020

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతూ ఉండడంతో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను తెరవడానికి ఆదేశాలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పాఠశాలలను తెరవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను తెరుస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాయి స్కూలు యాజమాన్యాలు. కానీ ఢిల్లీలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. తెరచిన స్కూల్స్ ను మూసి వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

ఢిల్లీలో స్కూళ్ల‌ను త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మ‌నీష్ శిసోడియా తెలిపారు.  రెగ్యుల‌ర్‌గా క్లాసులు నిర్వ‌హించేందుకు విద్యార్థులు త‌ల్లితండ్రులు ఆస‌క్తిగా లేర‌ని.. కోవిద్-19 ప్రబలే అవకాశం ఉండడంతో  ప్ర‌భుత్వ, ప్రైవేటు స్కూళ్ల‌ను మూసివేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దేశ‌రాజ‌ధానిలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం ఢిల్లీలో కొత్త‌గా 4853 కేసులు న‌మోదు అయ్యాయి.  దీంతో న‌గ‌ర ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.  శీతాకాలం కావడంతో ఢిల్లీలో కాలుష్యం కూడా ఎక్కువైంది. 

ఇక భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువవుతోంది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 43,893 మందికి కరోనా నిర్ధారణ అయిందని  తెలిపింది. అదే సమయంలో 58,439 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322 కి చేరింది. 24 గంట‌ల సమయంలో 508 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,20,010 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 72,59,509 మంది కోలుకున్నారు. 6,10,803 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle