newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ఇంటినుంచి పని చేస్తే నష్టపోయేదే ఎక్కువ.. సత్యనాదెళ్ల వ్యాఖ్య

08-10-202008-10-2020 09:51:21 IST
Updated On 08-10-2020 09:58:05 ISTUpdated On 08-10-20202020-10-08T04:21:21.374Z08-10-2020 2020-10-08T04:21:19.200Z - 2020-10-08T04:28:05.526Z - 08-10-2020

ఇంటినుంచి పని చేస్తే నష్టపోయేదే ఎక్కువ.. సత్యనాదెళ్ల వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తితో అనివార్యంగా మారిన వర్క్‌ ఫ్రం హోం​ (ఇంటి నుంచి పని)తో ప్రపంచంలో అందరికంటే మైక్రోసాఫ్ట్‌ భారీగా లాభపడింది. వర్క్‌ ఫ్రం హోం పద్ధతి విశ్వవ్యాప్తంగా తప్పనిసరి కావడంతో క్లౌడ్‌ సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తులకు భారీ డిమాండ్‌ నెలకొంది. అయితే ప్రపంచ టెక్ దిగ్గజం సీఈవో సత్య నాదెళ్ల మాత్రం ఈ పద్ధతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్‌ ఫ్రం హోంతో లాభాలున్నా ఇది సంక్లిష్టతలతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌ మీటింగ్‌లతో ఉద్యోగులు అలసిపోతారని, పని వాతావరణం నుంచి ప్రైవేట్‌ జీవితానికి మారడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. 

వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌ సీఈఓ కౌన్సిల్‌ భేటీలో ఆయన మాట్లాడుతూ, మీరు ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు పనిచేస్తూ నిద్రిస్తున్నట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. వీడియో సమావేశాలు ఉత్సాహపూరితంగా ఉన్నా 'ఉదయాన్నే మీ మొదటి వీడియో సమావేశానికి ముప్పై నిమిషాల పాటు వీడియోలో ఏకాగ్రతతో వ్యవహరించడం కీలకం కావడంతో ఆపై అలిసిపోయే అవకాశం ఉంద’ని అన్నారు. దూరం నుంచి పనిచేయడం వల్ల కార్యాలయంలో ఉండే ప్రయోజనాలను కోల్పోతామని చెప్పుకొచ్చారు. 

వీడియో సమావేశాలు లాంఛనంగా మారాయని, సమావేశాల ముందు, తర్వాత పనులు చక్కబెట్టాల్సి వస్తుందని చెప్పారు. పని, వ్యక్తిగత కార్యకలాపాల మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలనేది మహమ్మారి తనకు బోధించిందని చెప్పారు. తన షెడ్యూల్‌పై తాను ఎక్కువగా దృష్టిసారించానని తెలిపారు. దూరం నుంచి పనిచేస్తూ కొత్తగా విధుల్లో చేరినవారిని మీరు సంస్థలోకి ఆహ్వానించాలని, శిక్షణ, నైపుణ్య సముపార్జన, నైపుణ్యాలను తాజాపర్చడం కీలక అంశాలుగా ముందుకొచ్చాయని చెప్పారు. 

కాగా, వర్క్‌ ఫ్రం హోం పద్ధతి విశ్వవ్యాప్తంగా తప్పనిసరి కావడంతో క్లౌడ్‌ సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తులకు భారీ డిమాండ్‌ నెలకొంది.

ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌ భద్రతపై దృష్టిసారించాలని సత్య నాదెళ్ల ఇదే సమావేశంలో పిలుపు ఇచ్చారు. ఇంటర్‌నెట్‌ భద్రతకు పెద్దపీట వేస్తూ సోషల్‌ మీడియాలో కీలక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ తన ఎక్స్‌బాక్స్‌ గేమింగ్‌ వేదిక ద్వారా కంటెంట్‌ సంబంధిత అంశాలను పరిష్కరించడంలో అనుభవం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle