newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. దర్శనానికి వెళ్లాలంటే నిబంధనలివే..!

16-10-202016-10-2020 15:29:25 IST
2020-10-16T09:59:25.127Z16-10-2020 2020-10-16T09:58:45.156Z - - 21-10-2020

తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. దర్శనానికి వెళ్లాలంటే నిబంధనలివే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.   శబరిమల ఆలయం భక్తుల కోసం తెరుచుకోనుంది. కరోనా నేపథ్యంలో మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. నెలవారి పూజాకార్యక్రమాల్లో భాగంగా ఈ సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను ఆలయంలోని అనుమతించనున్నట్టు ట్రావెంకోర్ దేవస్వోం బోర్డు ప్రకటించింది. శబరిమల యాత్రకు కొత్త మార్గదర్శనాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయాలు అంటూ ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు యాత్రకు రానున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. భక్తులందరూ ఈ నిబంధలనను తెలుసుకోవాలని కోరింది.

60 ఏళ్లు పైబడిన వారు, 10 సంవత్సరాల లోపు పిల్లలను యాత్రకు అనుమతించరు. గుండె సమస్యలతో బాధపడుతున్న వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా శబరిమల యాత్రకు రాకూడదని స్పష్టం చేశారు. దర్శనానికి 48 గంటల ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగటివ్‌ వచ్చిన వారినే అనుమతిస్తారు.

ప్రతి ఒక్కరూ కరోనా నెగెటవ్ వచ్చిన రిపోర్టును తీసుకురావాలి. ఈ టెస్టును దర్శన సమయానికి 48 గంటల ముందు చేయించుకుని ఉండాలి. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దర్శనానికి సంబంధించి వర్చువల్ క్యూ పోర్టల్ లో పేరు నమోదు చేసుకోవాలి.

శబరి కొండను ఎక్కేందుకు అవసరమైన ఫిట్ నెస్ ఉన్నట్టు మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. వారాంతాల్లో రోజుకు 2000 మంది, ఇతర రోజుల్లో రోజుకు 1000 మంది చొప్పున భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. వెబ్‌సైట్‌లో ఈ మేరకే రిజిస్టర్‌ చేసుకునే వీలు కల్పించారు. 

అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేయడం, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బస చేయడానికి అనుమతించరు.

ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఇతర దారులను తాత్కాలికంగా మూసి ఉంచుతారు. యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్య బీమా కార్డులను వెంట తెచ్చుకోవాలి.

ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురించి, అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహతా కోరారు. ఈ మేరకు గురువారం (అక్టోబర్ 15) ఓ ప్రకటన విడుదల చేశారు.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle