భారత మహిళ నీరా టాండన్‌కు బైడన్ పదవి.. రిపబ్లికన్ల కన్నెర్ర
02-12-202002-12-2020 10:17:15 IST
2020-12-02T04:47:15.392Z02-12-2020 2020-12-02T04:46:34.777Z - - 16-01-2021

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే భారత సంతతి అమెరికన్ మహిళ నీరాటాండన్ను అత్యున్నత పదవిలో నియమించడం ద్వారా అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రాధాన్యతలను తేల్చి చెప్పారు. కానీ యూఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా ఇండో అమెరికన్ నీరాటాండన్ నియామకాన్ని రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సెనేట్‌లో కీలక సభ్యులు కొందరు బహిరంగంగానే ఆమె నియామకంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. గతంలో పలువురు సెనేటర్లకు వ్యతిరేకంగా ఆమె అనేక అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని వీరి విమర్శ. టాండన్ నియామకానికి సెనేట్ ఆమోద ముద్ర తప్పనిసరి. ఈనేపథ్యంలో రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. నీరా నియామకం బైడెన్ ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో అత్యంత చెత్త నిర్ణయమని ప్రముఖ సెనేటర్ జాన్ కార్నిన్ మండి పడ్డారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తే, ఆమెతో కలిసి పనిచేయడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. పాత వ్యాఖ్యలు బయటపడకుండా ఉండేందుకు ఆమె ఇటీవల తన పాత ట్వీట్లను చాలావరకు డిలీట్ చేసిందన్నారు. రిపబ్లికన్లను విమర్శిస్తూ చేసిన దాదాపు 1000 ట్వీట్లను ఆమె తొలగించిందన్నారు. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 50 సీట్లున్నాయి. డెమొక్రాట్లకు 48 సీట్లున్నాయి. కీలకమైన రెండు సీట్లకు జనవరి 5న ఎన్నిక జరగనుంది. నీరా పాత ట్వీట్లను పరిశీలిస్తే ట్రంప్‌పై, సెనేట్ మెజార్టీ లీడర్ మెక్కనెల్పై పలు విమర్శలున్నాయి. మెక్కనెల్ను ఆమె మాస్కో మిచ్ అని సంబోధించారు. అప్పుడప్పుడు డెమొక్రాట్లకు మద్దతు పలికే రిపబ్లికన్ సెనేటర్ కాలిన్స్‌ను పాథటిక్గా ఆమె వర్ణించారు. ట్రంప్ కామెంట్ల కంటే నీరా వ్యాఖ్యలు సరళమే గతంలో ఆమె నిర్వహించిన పదవుల్లో వివక్షతో వ్యవహరించారని కొందరు సెనేటర్లు విమర్శించారు. అయితే టాప్ డెమొక్రాట్ సెనేటర్లలో కొందరు మాత్రం ఆమె నియామకాన్ని సమర్థించారు. ట్రంప్ కామెంట్లతో పోలిస్తే ఆమె కామెంట్లు చాలా సరళంగా ఉన్నాయన్నారు. బైడెన్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా 50 ఏళ్ల టాండన్ నియామకాన్ని రిపబ్లికన్ల ఆధిపత్యంలోని సెనేట్ ఆమోదిస్తే యూఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా అత్యున్నత పదవిని చేపట్టబోయే శ్వేతేతర మహిళగా టాండన్ చరిత్రకెక్కుతారు. ఆమె కెరీర్ మొత్తంలో కార్మికవర్గ కుటుంబాల సంక్షేమం పట్ల అధికంగా దృష్టి పెట్టారు. విశాల ప్రాతిపదికన ఆర్థిక వృద్ధి, అసమానతలను నిర్మూలించడం ఆమెకు ఇష్టమైన విషయాలు. రిపబ్లికన్లను కనీసం సంప్రదించకుండా టాండన్‌ను అత్యున్నత పదవికి బైడెన్ ఎంపిక చేయడం ఆశ్చర్చంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ కార్నిన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి వారాల్లో ఆమె దాదాపు వెయ్యికిపైగా ట్వీట్లను, వ్యాఖ్యలను తొలగించిందని, అంతమాత్రాన వాటిని ఎవరూ వెలికి తీయలేదనుకోవడం చిన్న పిల్లల చేష్టను తలపిస్తుందని ఆయన చెప్పారు. ట్విట్టర్లో 3 లక్షలకు పైగా ఫాలోయర్లను కలిగిన టాండన్ రిపబ్లికన్ సెనేటర్లు, దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు.

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
7 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
5 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
8 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
9 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
9 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
11 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
11 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
11 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021

జోబైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో లేడీ గాగా, లోపెజ్ ప్రదర్శన
15-01-2021
ఇంకా