newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

13-05-202113-05-2021 21:33:24 IST
2021-05-13T16:03:24.899Z13-05-2021 2021-05-13T16:03:21.304Z - - 14-06-2021

మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ అత్యంత ఉద్ధృతంగా వ్యాపించడానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మతపరమైన సమావేశాలే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మత సమావేశాలు, రాజకీయ సమావేశాలతో పాటు ఇతరత్రా అనేక అంశాలు కూడా  ఇందుకు దోహదం చేశాయని తెలిపింది. 2020 అక్టోబర్ లోనే బి. 1 617 కు చెందిన వైరస్లు భారత్ లో కనిపించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వారాంతపు ప్రకటనలో తెలిపింది.  భారత్ లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడం మరణాలు తీవ్రం కావడంతో ఏ రకమైన కోవిడ్ వైరస్ లు దేశంలో ఉన్నాయి? వేటి  కారణంగా ఈ సంభవిస్తున్నాయన్న దానిపై సందేహాలు తలెత్తాయి. ప్రస్తుతం భారత్ లో ఉన్న వైరస్ కు చాలా త్వరితగతిన వ్యాపించే లక్షణాలు ఉన్నాయని  ఇందుకు ఇటీవల జరిగిన మత, రాజకీయ సమావేశాలు మరింతగా దోహదం చేశాయని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. ఈ సమావేశాల కారణంగా సామాజిక దూరం అన్న నిబంధన గాలిలో కలసిపోయిందని వెల్లడించింది. ఈ సమావేశాలే చాలా తీవ్రస్థాయిలో కోవిడ్  వైరస్ వ్యాప్తికి, మరణాలకు దారితీశాయని  వెల్లడించింది.  కోవిడ్ రెండవ దశ అత్యంత తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికలు జారీ అయినప్పటికీ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు భారీ ఎత్తున ప్రజలను సమీకరించి సమావేశాలు నిర్వహించాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాంటి భారీ ఎన్నికల సభల్లో ప్రసంగించారు కూడా. అంతేకాదు తన సభలకు ఇన్ని లక్షల మంది హాజరు కావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. అలాగే దాదాపు కోటి మంది హాజరైన కుంభమేళా కూడా వైరస్ వ్యాప్తికి ఎంతగానో దోహదం చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్వయంగా కుంభమేళాకు రావాలంటూ ప్రజలను ప్రోత్సహించారు. అయితే వైరస్ కేసులు తీవ్రం కావడంతో  ఆయన వెనక్కి తగ్గారు. ఈ సమావేంశాలన్నింటిలోనూ కోవిడ్ నిబంధనలను ఎవరూ పట్టించుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉన్న బి. 1 617. 1 అలాగే బి. 1. 617.2  వైరస్ రకాలకు విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉందని తెలిపింది. భారత్ తరువాత ఈ రకమైన వైరస్ కారణంగా అత్యధిక కేసులు బ్రిటన్ లో నమోదయ్యాయని తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా  కోవిడ్ కేసులు, మరణాల రేటు స్వల్పంగా తగ్గిందని తెలిపింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో ఒక్క భారత్ లోనే  95 శాతం కేసులు 93 శాతం మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఇక  ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 50 శాతంభారత్ లోనే ఉన్నాయని, 30 శాతం మరణాలు ఇక్కడే సంభవిస్తున్నాయని వెల్లడించింది.   

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   5 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle