newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

ఆహార భద్రతపై రాజీపడం.. ప్రధాని స్పష్టీకరణ

17-10-202017-10-2020 13:06:20 IST
2020-10-17T07:36:20.178Z17-10-2020 2020-10-17T07:36:12.437Z - - 29-10-2020

ఆహార భద్రతపై రాజీపడం.. ప్రధాని స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆహార భద్రతకు అతికీలకమైన రెండు అంశాలకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ వక్కాణించారు. రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. పంటలకు మద్దతు ధర, ధాన్య సేకరణలు దేశ ఆహార భద్రతనే నిర్ణయించే ప్రధానమైన అంశాలని వీటి విషయంలో తామెన్నటికీ రాజీపడమని ప్రధాని చెప్పారు.

అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌’ ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో మండీల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సాగును విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకూ ఉద్దేశించినవని వివరించారు. 

వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా కనీస మద్దతు ధర విధానం శాస్త్రీయమైన పద్ధతిలో కొనసాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రపంచ ఆహార భద్రత విషయంలో భారత్‌ నిబద్ధతకు ఇటీవలి వ్యవసాయ సంస్కరణలే నిదర్శనమని ఆయన వివరించారు. అత్యవసర సరుకుల చట్టంలో చేసిన మార్పులతో మండీల మధ్య పోటీతత్వం ఏర్పడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు ఆహార వృథాను అరికట్టవచ్చునని ప్రధాని చెప్పారు. ఇప్పుడు మార్కెట్లే చిన్న, సన్నకారు రైతుల ఇంటి ముందుకు వచ్చేస్తాయి. అధిక ధరలు అందేలా చేస్తాయి. దళారులు లేకుండా పోతారు అని ప్రధాని మోదీ వివరించారు. 

కోట్లాదిమందికి ఉచిత రేషన్ ఇవ్వడం ప్రపంచంలోనే అరుదు.. మోదీ

కోవిడ్‌–19 కాలంలో భారత ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల విలువైన తిండిగింజలను దేశంలోని 80 కోట్లమంది పేద ప్రజానీకానికి ఉచితంగా రేషన్‌ను, ఆహార దినుసులను అందజేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఉచిత రేషన్‌‌ని యూరప్, అమెరికాలోని జనాభా కంటే ఎక్కువ మందికి అందించామని అన్నారు. కోవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపం గురించి రకరకాలుగా చర్చ జరిగింది. కానీ మనం ఉచితంగా కోట్లాదిమందికి రేషనిచ్చాం. దాదాపు లక్షా 15వేల కోట్ల విలువైన ఆహారదినుసులను పంపిణీ చేశాం. ఇలాంటిదెక్కడా జరగలేదని ప్రధాని పేర్కొన్నారు.

దేశంలో పోషకాహార లోప సమస్యనూ అధిగమించే కృషి సాగుతోంది. ఇపుడు ఎక్కువ మాంసకృత్తులుండే ఆహారదినుసులుండేవే పండించేట్లు ప్రోత్సహిస్తున్నాం. ప్రొటీన్‌, ఐరన్‌, జింక్‌ పరిమాణాలు ఎక్కువ ఉండే పంటలకు ప్రాధాన్యమిస్తున్నాం అని ప్రధాని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా పోషకాహార లోపాలను అధిగమించేందుకు కేంద్రం సిద్ధం చేసిన ఎనిమిది పంటల 17 బయో ఫోర్టిఫైడ్‌ వంగడాలను మోదీ విడుదల చేశారు. ప్రధాని జాతికి అంకితం చేసిన 17 కొత్త వంగడాల్లో ప్రత్యేకతలు ఎన్నో. కొన్ని పోషకాలు సాధారణ వంగడాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. 

కొత్త వంగడాల్లో రెండింటిని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) అభివృద్ధి చేసింది. గిర్నార్‌ –4, గిర్నార్‌ –5 అని పిలుస్తున్న ఈ రెండు వేరుశనగ వంగడాల్లో ఓలిక్‌ ఆసిడ్‌ మోతాదు ఎక్కువ. సబ్బులు, ఫార్మా, వస్త్ర పరిశ్రమల్లో ఓలిక్‌ ఆసిడ్‌ను ఉపయోగిస్తారు. జాతికి అంకితం చేసిన వాటిల్లో గోధుమ వంగడాలు ఐదు ఉండగా.. మొక్కజొన్న వంగడాలు మూడు, రాగులు, వేరుశనగ రెండు చొప్పున ..వరి, సామలు, ఆవాలు, కంద వంగడాలు ఒక్కొక్కటి ఉన్నాయి. 

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

   an hour ago


ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   3 hours ago


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   3 hours ago


త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

   20 hours ago


భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

   20 hours ago


కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్

కరోనా కేసుల అప్డేట్

   28-10-2020


అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

   28-10-2020


హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

   28-10-2020


కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

   27-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle