newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

వీర‌ప్ప‌న్ ను మించిన బ్యాచ్

18-10-202018-10-2020 15:12:29 IST
2020-10-18T09:42:29.454Z18-10-2020 2020-10-18T09:42:21.446Z - - 21-10-2020

వీర‌ప్ప‌న్ ను మించిన బ్యాచ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎర్ర చంద‌నం అంటే వీర‌ప్ప‌నే గుర్తొస్తాడు. వీర‌ప్ప‌న్ స్మ‌గ్లింగ్ స్టైల్ వేరే. పోలీసులు కూడా వ‌ణికిపోయేలా చేశాడు. వీర‌ప్ప‌న్ ని గెలిచారు కానీ.. ఆయ‌న శిష్యుల‌ను మాత్రం ఎండ్ చేయ‌లేక పోతున్నారు. అఫ్ కోర్స్ ఎర్ర చంద‌నం డిమాండ్ అలాంటిది. ఎలా ఎండ్ అవుతుంది ఈ స్మ‌గ్లింగ్ చెప్పండి. ఇప్పుడు కూడా అదే స్టైల్ ని ఫాలో అవుతున్నార‌ట స్మ‌గ్ల‌ర్లు. మొద్దుల కోసం ప్రాణాల‌కు సైతం వెన‌కాడ‌కుండా స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. 

శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర చంద‌నం ఏ రేంజ్ లో ఉందో అంద‌రికీ తెలిసిందే. అందుకే.. చిన్న చిన్న దొంగ‌లు కాకుండా కోట్ల‌ల్లో డీల్ చేసే బ‌డా బాబులు వెన‌కాల ఉండి స్మ‌గ్లింగ్ చేయిస్తుంటారు. ఇక దొంగ‌ల‌కి కూడా దుంగ‌లు తెస్తే డ‌బ్బులు బానే ఇస్తారు. అందుకే.. ఒక‌టీ రెండు సార్లు అడ‌విలోకి స్మ‌గ్లింగ్ కి వెళ్తే ప‌దేళ్ల పాటు తాపీగా ప‌డుకోవ‌చ్చు. పనీ పాటా లేకుండా బ‌తికేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. కాక‌పోతే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆఫీస‌ర్లేం త‌క్కువోళ్లా చెప్పండి. బ‌డా బాబులు వెన‌కాల ఉన్నా.. పేరు మోసిన దొంగ‌లు స్మ‌గ్లింగ్ కి వ‌చ్చినా.. చుక్క‌లు చూపిస్తున్నారు. అడ‌వి నుంచి దొంగ‌లు దుంగ‌లు ఎత్తుకెళ్ల‌డం కాదు.. అస‌లు ఎంట్ర‌న్స్ ద‌గ్గ‌రే ఆపేస్తున్నారు. నానా ప్లాన్లూ వేసినా.. అన్నిటినీ చిత్తుచేసి పంపుతున్నారు. త‌మిళనాడు నుంచి వ‌చ్చిన పాతిక మంది స్మ‌గ్ల‌ర్ల‌తో బొమ్మాట ఆడుకున్నార‌ట‌. వాళ్లేదో త‌క్కువ అంచ‌నా వేసి వ‌చ్చుంటారు. స‌ర‌దా తీర్చి పంపారు. మొత్తం ప‌రార‌య్యార‌ట‌. అడ‌వీ మాదే వేటా మాదే అంటూ త‌రిమేశారట‌. 

తిరుప‌తిలోని క‌ర‌కం బాడీ రోడ్డులో టాస్క్ ఫోర్స్ పోలీసులు.. దొంగ‌ల్ని త‌రిమేశారు. వీళ్ల‌ని రోడ్డుమీద చూడ‌గానే ల‌గ్గాయెత్తార‌ట‌. ఆ దొంగ‌లేం మామూలుగా రాలేదు. ఎన్ని లోడ్ లు ఎత్తాల‌ని చూశారో కానీ.. పాతిక మంది వారం రోజులు పాటు ఫారెస్ట్ లో ఉండ‌డానికి ప్రిపేర్ అయ్యి వ‌చ్చార‌ట‌. వారానికి స‌రిప‌డా బ‌ట్ట‌లు, బోజ‌నాలు అన్నీ తెచ్చుకున్నార‌ట‌. ఇంకేం చేస్త‌రు. పోలీస్ ప‌వ‌ర్ తెలిసి..ల‌గ్గాయెత్తారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle