ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-202115-01-2021 17:28:30 IST
2021-01-15T11:58:30.260Z15-01-2021 2021-01-15T10:31:21.383Z - - 27-02-2021

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో మద్యం ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత భారీగా మందుబాబుల జోబులకు చిల్లు పడడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను పెంచడానికి ముఖ్య కారణం మందు బాబులను మద్యానికి దూరం చేయడమే అని చెప్పుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు పెట్రోల్-డీజిల్ ధరలను పెంచి అచ్చం అలాంటి లాజిక్ నే చెప్పనున్నారు కేంద్రం పెద్దలు. ఇలా పెట్రోల్-డీజిల్ ధరలను పెంచేస్తే.. ప్రజలు ఎలెక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి మళ్లిస్తారని చెబుతూ ఉన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం రోజువారీగా పెంచుతోంది. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు పెరగకపోయినప్పటికీ.. దేశంలో మాత్రం ధరలు పెరుగుతూ ఉన్నాయి. గత రెండు రోజుల్లో లీటర్‌పై అరవై పైసల వరకూ పెరిగింది. లాక్ డౌన్ తర్వాత నుంచి కేంద్రం… ఇప్పటి వరకూ ఇరవై రూపాయల వరకూ వడ్డించింది. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు 90 రూపాయలు దాటిపోయింది. ఏపీలో మద్యం అలవాటును తగ్గించడానికి మద్యం ధరలు పెంచినట్లుగా వాహన అలవాట్లను తగ్గించడానికి ఇలా ధరలు పెంచుతున్నారా అన్న చర్చను బీజేపీ అనుకూల మీడియా చెబుతోంది.
ఇంటర్నేషనల్ ధరలు, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రకారం ఇండియాలో ప్రతి రోజూ డీజిల్, పెట్రోల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మారుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడల్లా పన్నులు పెంచుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధరలో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 55 వరకూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయన్న కారణంగా రేట్లు పెంచుతూనే ఉన్నారు.. ట్యాక్స్‌లు తగ్గించే ప్రయత్నం చేయడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు .. పన్నులు బాదేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఎలెక్ట్రిక్ వాహనాలు వచ్చినా ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం భారత్ లో పెద్ద మైనస్ గా మారబోతోంది. ఎలెక్ట్రిక్ వాహనాలు పూర్తి స్థాయిలో భారత రోడ్లపై తిరగాలంటే.. చాలా సంవత్సరాలే ఎదురుచూడాల్సి ఉంటుంది.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా
an hour ago

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ
an hour ago

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు
2 hours ago

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
13 hours ago

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్
21 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!
20 hours ago

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్
a day ago

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్లో ట్రెండింగ్
26-02-2021

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు
18 hours ago

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం
26-02-2021
ఇంకా