రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు
03-03-202103-03-2021 15:05:35 IST
Updated On 03-03-2021 16:31:23 ISTUpdated On 03-03-20212021-03-03T09:35:35.925Z03-03-2021 2021-03-03T09:07:29.883Z - 2021-03-03T11:01:23.160Z - 03-03-2021

కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న కర్ణాటక జలవనరులశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు వీడియోలు బయటకు వచ్చాయి. ఆమెతో ఉన్న ప్రైవేట్ వీడియోలు, వీడియో కాల్స్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎట్టకేలకు రాజీనామా చేసేశాడు. మొదట ఆ వీడియోల్లో ఉన్నది తాను కానే కాదని చెప్పిన ఆయన.. తన మంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంగళవారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా రమేష్ చెప్పారు. కానీ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడిల కారణంగా బుధవారం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. మంత్రి రమేశ్ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. ఉప ఎన్నికల ముంగిట ఇలా శృంగార సీడీ బాంబు పేలడంతో బీజేపీ చిక్కుల్లో పడింది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయింది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి రమేశ్ జార్కిహొళి. కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి.. వారు బీజేపీ చెంత చేరేలా చేసింది రమేశ్ జార్కిహొళినే..! గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ నేతలతో విభేదించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. ఇప్పుడు ఇలా సెక్స్ స్కాండల్ లో అడ్డంగా దొరికిపోయారని కర్ణాటక మీడియా కోడై కూస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన రమేశ్ జార్కిహోళి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని సదరు యువతి ఆరోపించింది. ఆ ఏకాంత దృశ్యాల వీడియోను సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందించారు. ఆయన ఆ వీడియో సీడీని కొన్ని టీవీ ఛానళ్లకు పంపించారు. మహిళను మోసగించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌ను దినేశ్ కోరారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన
10 hours ago

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు
14 hours ago

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ
20 hours ago

ముత్యాలు పండాయి అనడం కాదు.. నిజంగానే పండిస్తే మస్తు లాభాలు
21 hours ago

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా
09-04-2021

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ
09-04-2021

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం
09-04-2021

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే
08-04-2021

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం
08-04-2021

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ
08-04-2021
ఇంకా