newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

26-07-202126-07-2021 10:46:19 IST
2021-07-26T05:16:19.479Z26-07-2021 2021-07-26T05:16:14.953Z - - 21-09-2021

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది. అయితే సరైన నమూనాలో దరఖాస్తు రూపొందకపోవటంతో దానిని రిజెక్ట్ చేసారు. తిరిగి మళ్ళీ లోపాలని సరిదిద్ది పంపడంతో  ప్రముఖ నర్తకి, యునెస్కో కన్సల్టెంట్‌గా ఉన్న చూడామణి నందగోపాల్‌ రెండు రోజుల పాటు రామప్ప ఆలయాన్ని పరిశీలించి.. శిల్పాలు, ఇతర ప్రత్యేకతలను అందులో పొందుపర్చారు. తర్వాత యునెస్కో అనుబంధ ‘ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మ్యాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌ (ఐకొమాస్‌)’ ప్రతినిధి వాసు పోష్యానందన 2018లో రామప్ప ఆలయాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు ఉండి ఆలయం ప్రత్యేకతలను, యునెస్కో గైడ్‌లైన్స్‌ ప్రకారం పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించి.. యునెస్కోకు నివేదిక ఇచ్చారు. తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న ప్యారిస్‌లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నుంచి పురావస్తుశాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ప్రతినిధులు వెళ్లి మరిన్ని వివరాలు అందజేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కేలా చూడాలని సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

మొత్తానికి అయిదు సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలతో రామప్ప ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ హోదా సంపాదించిన రామప్ప ఆలయానికి ఇక మహర్దశ వచ్చినట్టే. దీనిద్వారా యునెస్కో అధీనంలోకి వెళ్ళిన రామప్ప ఆలయానికి ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు మరియు కట్టడాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు లక్షలాదిగా రామప్పని సందర్శించే  అవకాశం ఉంటుంది. అంతే కాదు రామప్పకు యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు అభినందనలు. కాకతీయ రాజవంశ విశిష్ట శిల్పకళా వైభవం రామప్ప ఆలయంలో కళ్లకు కడుతోంది. ఆ దేవాలయ సముదాయాన్ని అందరూ సందర్శించాలని, ఆలయ మహత్మ్యం తెలుసుకొని స్వయంగా అనుభూతి పొందాలని కోరుతున్నానని అన్నారు. సిఎం కేసీఆర్ మాట్లాడుతూ కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడానికి మద్దతిచ్చిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా లభించడంతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటిఆర్, శ్రీనివాస్ గౌడ్ లు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు.

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

   2 hours ago


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

   19-09-2021


సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

   18-09-2021


గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

   18-09-2021


ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

   18-09-2021


పెట్రోల్, డీజిల్ ని GST కింద తీసుకురావడానికి ప్రయత్నించాం: నిర్మలా సీతారామన్.. కానీ

పెట్రోల్, డీజిల్ ని GST కింద తీసుకురావడానికి ప్రయత్నించాం: నిర్మలా సీతారామన్.. కానీ

   17-09-2021


11 వ తరగతి పరీక్షలను నిర్వహించడానికి ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

11 వ తరగతి పరీక్షలను నిర్వహించడానికి ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

   17-09-2021


ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 20 రోజుల మెగా వాక్సినేషన్ కార్యక్రమం

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 20 రోజుల మెగా వాక్సినేషన్ కార్యక్రమం

   17-09-2021


అయోధ్య రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తైంది

అయోధ్య రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తైంది

   16-09-2021


థర్డ్ వేవ్ లేదు.. రాబోయే ఆరు నెలల్లో కరోనా వైరస్ మరింత బలహీన పడుతుంది

థర్డ్ వేవ్ లేదు.. రాబోయే ఆరు నెలల్లో కరోనా వైరస్ మరింత బలహీన పడుతుంది

   16-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle