newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

చైనా సరిహద్దులకు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఎందుకో తెలుసా..?

25-10-202025-10-2020 09:23:49 IST
2020-10-25T03:53:49.048Z25-10-2020 2020-10-25T03:53:42.472Z - - 03-12-2020

చైనా సరిహద్దులకు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఎందుకో తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చైనా సరిహద్దులకు వెళ్లారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా ఆయుధ పూజను చేసేందుకు  సిక్కింలోని షిరాతంగ్ ప్రాంతానికి రాజ్ నాథ్ చేరుకున్నారు. వాస్తవాధీన రేఖకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఆయన ఆయుధ పూజను నిర్వహించనున్నారు. సైనికులతో కలిసి ఆయన పండగ చేసుకోనున్నారు. సుక్నా కేంద్రంగా ఉన్న 33 క్రాప్స్ హెడ్ కర్వార్టర్స్ లో ఆయన భారత సైనిక ఆయుధ సంపత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారని సిక్కిం సెక్టార్ అధికారులు వెల్లడించారు. ఇక్కడి సైనిక దళాలను 'త్రిశక్తి'గా పిలుస్తారు. శనివారం నాడు సిక్కిం చేరుకున్న రాజ్ నాథ్ కు అక్కడి సైనిక అధికారులు స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు రాజ్ నాథ్ పర్యటన సాగనుంది. లడాక్ రీజియన్ లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి సంఘీభావంగా దేశమంతా నిలిచివుందన్న సంకేతాలను పంపేందుకే రాజ్ నాథ్ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. ఇటీవలి కాలంలో చైనా దూకుడుగా ప్రవర్తిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ నేపథ్యంలోనే ఆయుధ పూజకు ఆ ప్రాంతాన్ని రాజ్ నాథ్ ఎంచుకున్నారని సమాచారం. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle