newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రఫేల్ స్కామ్ నుంచి మీరు తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ

07-04-202107-04-2021 18:11:02 IST
2021-04-07T12:41:02.214Z07-04-2021 2021-04-07T12:40:49.998Z - - 11-04-2021

రఫేల్ స్కామ్ నుంచి మీరు తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫ్రెంచ్ యుద్ధవిమానం రఫేల్ ఒప్పందంలో మధ్యవర్తికి భారీ ముడుపులు ఇచ్చినట్లు ఫ్రెంచ్ మీడియా నివేదించిన నేపథ్యంలో రఫేల్ ముడుపులు కేంద్ర ప్రభుత్వం చేసుకున్న కర్మ అని దాని ఫలితం నుంచి ఎవరూ తప్పించుకోలేరని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మన చర్యలన్నీ కర్మ ఫలితమేనని దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సుప్రసిద్ధమైన ఫ్రెంచ్ యుద్దవిమానాల తయారీ సంస్థ భారత్‌తో రఫేల్ విమానాల డీల్ కుదుర్చుకోవడానికి మధ్య దళారీకి 1.1 మిలియన్ యూరోలను ముడుపుల కింద ఇచ్చిందని ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. పాలక బీజేపీ దీన్ని నిరాధార వార్తగా కొట్టిపడేయడాన్ని రాహుల్ అపహాస్యం చేశారు.

రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, తన ఆరోపణలు నిజమని ఫ్రెంచ్ మీడియానే నిర్ధారించిందని రాహుల్ పేర్కొన్నారు.

కర్మ అంటే భారతీయ సంప్రదాయంలో మనుషులు చేసే పనులు ఫలితమేనని, ఎవరూ ఈ కర్మ పరిపాకం నుంచి తప్పించుకోలేరని రాహుల్ ట్వీట్ చేసారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంలో కుంభకోణన్ని ప్రధానాస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చంది కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్నే చూసింది.

తన రక్షణ అవసరాల కోసం 126 రఫేల్ అత్యాధునిక యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి భారత్ ప్రెంచ్ విమానాల తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో తొలి 36 విమానాల కొనుగోలు వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయని తొలినుంచి ఆరోపణలు వచ్చాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా ఈ ఆరోపణలను కొట్టివేయడంతో ఫ్రెంచ్ సంస్థ విడతలవారీగా రఫేల్ యుద్ధవిమానాలను భారత్‌కు సరఫరా చేస్తూండటం తెలిసిందే.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   10 hours ago

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   14 hours ago

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   20 hours ago

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   21 hours ago

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle