newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

వ్యాక్సిన్ విషయంలో భారత్ కు బంపరాఫర్ ఇచ్చిన పుతిన్

18-11-202018-11-2020 12:10:03 IST
Updated On 18-11-2020 14:46:31 ISTUpdated On 18-11-20202020-11-18T06:40:03.709Z18-11-2020 2020-11-18T06:39:56.069Z - 2020-11-18T09:16:31.015Z - 18-11-2020

వ్యాక్సిన్ విషయంలో భారత్ కు బంపరాఫర్ ఇచ్చిన పుతిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాకు వ్యాక్సిన్ విషయంలో భారత్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ఇతర దేశాలలోని ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి విషయంలో కూడా ఇప్పటికే మంచి ఫలితాలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతూ ఉంది. భారత్ లో కూడా ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సంస్థ.

స్పుత్నిక్ ట్రయల్స్, ఆపై పంపిణీని డాక్టర్ రెడ్డీస్ పర్యవేక్షించనుండడంతో.. 10 కోట్ల డోస్ లను ఆర్డీఐఎఫ్ ఇండియాకు పంపించనుంది. రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే, ఈ వ్యాక్సిన్ డోస్ లను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని రెడ్డీస్ ప్రతినిధులు ఇప్పటికే స్పష్టం చేశారు.    

ఇలాంటి సమయంలో కోవిద్19 వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ టీకాను ఇండియా తయారు చేసుకోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. భారత్ తో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసుకోవచ్చని పుతిన్ వెల్లడించినట్టు 'ఆర్ఐఏ' న్యూస్ ఏజన్సీ తెలిపింది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రజలను కరోనా నుంచి రక్షించడంలో 92 శాతం వరకూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ట్రయల్స్ మధ్యంతర ఫలితాలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ ను రష్యాలో వాడేందుకు ఆగస్టులోనే పుతిన్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అయితే పూర్తి స్థాయిలో ట్రయల్స్ పూర్తయ్యాకనే ఇతర దేశాల్లో అనుమతులు ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ మీద అప్పట్లో ఓ వర్గం అనుమానాలను కూడా వ్యక్తం చేసింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle