newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

16-01-202116-01-2021 12:30:32 IST
2021-01-16T07:00:32.118Z16-01-2021 2021-01-16T07:00:28.996Z - - 09-03-2021

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవమానకరమైన నిష్క్రమణకు తొలి అడుగుపడింది. అమెరికన్ కాంగ్రెస్ ఉభయసభలూ కొలువు దీరే కేపిటల్ హిల్ భవనంపై తిరుగుబాటు చేయాలని పెద్దఎత్తున మద్దతుదారులను రెచ్చగొట్టి హింసాకాండకు, తిరుగబాటుకు ప్రేరేపించాడని ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్‌పై అమరికా ప్రతినిధుల సభ అబిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. డెమాక్రాట్ల నియంత్రణలో ఉండే ప్రతినిధుల సభలో 232-197 ఓట్ల తేడాతో ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోద ముద్రపడింది. అమెరికన్ ప్రజాస్వామ్యంపై దారుణాతి దారుణంగా దాడి చేశారంటూ పేర్కొన్న ఈ తీర్మానానికి పది మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు కూడా మద్దతు పలికారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును ప్రేరేపించారు అని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రకటించారు. ఈమె డెమాక్రాటిక్ పార్టీ ప్రతినిధి. ట్రంప్ వెళ్లిపోవలసిందే. మనందరం ప్రేమించే ఘనమైన దేశానికి ట్రంప్ ఇప్పుడు ప్రమాదకారి అంటూ ఏకవాక్యంతో అభిశంసన తీర్మానాన్ని పెలోసి ప్రవేశపెట్టారు.

ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడూ పదివిలో ఉండగా అభిశంసన కారణంగా పదవి నుంచి తొలిగిపోలేదు. 1868లో ఆండ్రూ జాన్సన్, 1998లో బిల్ క్లింటన్, 2019లో ట్రంప్ అభిశంసనను ఎదుర్కొన్నారు కానీ, సెనేట్ వారిని అభిశంసన నుంచి విముక్తి చేసింది. అమరికా ఫస్ట్ అనే మితవాద ప్రజాకర్షక సందేశంతో పాలించిన ట్రంప్ రెండు సార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా చరిత్రకెక్కారు. 2019 డిసెంబర్‌లోనూ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. 

క్యాపిటల్‌ భవనంపై దాడికి బాధ్యుడిని చేస్తూ డెమొక్రటిక్‌ సభ్యులు ప్రతినిధుల సభలో తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టారు అనే ప్రధాన ఆరోపణతో ట్రంప్‌ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఈ తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్‌లో ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా 232 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. 10 మంది రిపబ్లికన్‌ సభ్యులు కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. 

అమెరికా చరిత్రలో ఇది నాలుగో అభిశంసన ప్రక్రియ. మద్దతుదారులను ఉద్దేశించి రెచ్చగొట్టేలా ప్రసంగించారని, ఆ కారణంగానే ప్రజాస్వామ్య సౌధమైన క్యాపిటల్‌ భవనంపై దాడితో పాటు హింస చెలరేగిందని ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో ఆరోపించారు. ఆ దాడి కారణంగా ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను పార్లమెంటు నిర్ధారించే ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ హింసలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రతినిధుల సభలో ఆమోదం పొందడంతో, ఈ అభిశంసన తీర్మానం సెనెట్‌కు వెళ్తుంది. సెనెట్‌లో కూడా ఆమోదం పొందితే.. ట్రంప్‌ ఇక జీవితకాలంలో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలేరు. అయితే, సెనెట్‌ సమావేశాలు ఇప్పటికే జనవరి 19 వరకు వాయిదా పడ్డాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో, అధ్యక్షుడిగా గడువు ముగిసేవరకు వైట్‌హౌజ్‌లో కొనసాగే అవకాశం ట్రంప్‌కు లభించింది. 

బైడెన్‌ ప్రమాణ స్వీకారం లోపు సెనెట్‌లో అభిశంసన తీర్మానం ప్రక్రియ ముగిసే అవకాశం లేదని సెనెట్‌ మెజారిటీ లీడర్‌ మిచ్‌ మెక్‌ కానెల్‌ పేర్కొన్నారు. సెనెట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే కనీసం 17 మంది రిపబ్లికన్‌ సభ్యులు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది.  

కాగా, అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ ఎంపీలైన అమీ బెరా, ఆర్‌ఓ ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.

కాగా పూర్తికా రాజకీయ ప్రయోజనాలను ఆశించే డెమాక్రాట్లు అదరాబాదరాగా ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారని రిపబ్లికన్ ప్రతినిధులు విమర్శించారు.

వ్యాక్సిన్ పాలసీకి భారత్ కట్టుబడింది.. IMF చీప్ గీతా గోపీనాథ్ ప్రశంస

వ్యాక్సిన్ పాలసీకి భారత్ కట్టుబడింది.. IMF చీప్ గీతా గోపీనాథ్ ప్రశంస

   44 minutes ago


ఇంతకూ ఆ 5 కోట్లు నాకెవరిచ్చారబ్బా... తాప్సీ బిగ్ జోక్

ఇంతకూ ఆ 5 కోట్లు నాకెవరిచ్చారబ్బా... తాప్సీ బిగ్ జోక్

   2 hours ago


అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ

   17 hours ago


73 ఏళ్ల పెద్దాయ‌న‌కు పెళ్లి మోజు.. కోటి 30 ల‌క్ష‌ల‌తో అమ్మాయి జంప్

73 ఏళ్ల పెద్దాయ‌న‌కు పెళ్లి మోజు.. కోటి 30 ల‌క్ష‌ల‌తో అమ్మాయి జంప్

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా

   08-03-2021


ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు

   08-03-2021


ఈ ఏడాదికి.. నారీ వారియ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేద్దాం

ఈ ఏడాదికి.. నారీ వారియ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేద్దాం

   08-03-2021


దీదీపై మోదీ సెటైర్లు..!

దీదీపై మోదీ సెటైర్లు..!

   07-03-2021


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!

   07-03-2021


కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ

   07-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle