newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

పాప‌ని గోకిన పోప్.. ర‌చ్చ రంబోలా..!

20-11-202020-11-2020 14:07:26 IST
2020-11-20T08:37:26.301Z20-11-2020 2020-11-20T08:37:22.344Z - - 06-12-2020

పాప‌ని గోకిన పోప్.. ర‌చ్చ రంబోలా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ముస‌లి త‌నానికి ద‌స‌రా పండ‌గ అని. ఏంద‌య్యా ఇది. అబ్బో.. సింత స‌చ్చినా.. పులుపు మాత్రం సావ‌లేదే. ముస‌లాయ‌నే కానీ.. మ‌హానుభావుడు. నీ ఏజ్ ఏంటి.. నీ చూపులేంటి.. బాధ్య‌తుండ‌క్క‌ర్లా. అబ్బ‌బ్బ‌.. ఇవండీ కామెంట్లు. కాక‌పోతే.. తెలుగులో కాదులెండి. వారి వారి భాష‌ల్లో.. ఈ మీనింగ్ వ‌చ్చేలా.. ఆడేసుకుంటున్నారు పోప్ ఫ్రాన్సిస్ ని. చూశారుగా ఎంత పెద్దాయ‌నో. పైగా పోపు. ఎంత రెస్పెక్ట్ ఉంటుంది చెప్పండి. ఒక్క‌సారి బ‌య‌టికొస్తే ల‌క్ష‌ల మంది చూడ్డానికొస్తారు. నోరు తెరిచి మాట్లాడితే.. జ‌నం ఊగిపోతారు. ఆయ‌న మాట జ‌వ‌దాటని వారు.. దేవుడ్ని మించి రెస్పెక్ట్ చేసే వాళ్లు ఎన్ని కోట్ల మందో లెక్కెట్టాలంటే క‌ష్ట‌మే. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్. కానీ ఏం చేస్త‌డు చెప్పండి. అంతా గంగ పాలైంది. కాదు కాదు.. అంత‌కు మించిన బుర‌ద సోష‌ల్ మీడియా పాలైంది.

అస‌లేం జ‌రిగింది అంటే.. సింపుల్. ఈ పోప్ గారు.. ఇన్ స్టా గ్ర‌మ్ లో ఈ పాప గారి ఫోటోని గోకారు. అదేలెండి.. టచ్ స్క్రీన్ మీద ఏలు పెట్టి ట‌చ్ చేశారో..  సిస్ట‌మ్ లో మౌస్ తో నెమిరారో. ఏదో ఒక‌టి చేశారు. అంతే.  అంతా ర‌చ్చ‌. ఊరుకుంటారా జ‌నాలు. మామూలుగానే పెద్దాయ‌న. నీకెదేం పాడుబుద్ద‌య్యా అంటారు. ఆమె ఏదో మోడ‌లు. బికినీ న‌టాలియాగా పేరుంది. హాట్ లుక్స్ ఇస్తూ పిచ్చెక్కిస్తుంది.  ఆమెను చూసి.. నువ్వు కూడా సొంగ కారిస్తే ఎలాగ‌య్యా.. నీ వ‌య‌సేంటి.. నీ స్టేట‌స్ ఏంటి.. మ‌ర్యాద గురించి ఆలోచించాలి క‌దయ్యా అంటున్నారు. సోష‌ల్ మీడియా దెబ్బ‌కి.. పోప్ గారు డిస్ లైక్ కొట్టార‌ట‌.  కానీ.. పాప ఊరుకుంటుందా. ముందే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంది. దాన్ని ఆమె అకౌంట్ లో పోస్ట్ చేసి ప‌డేసింది. పాప‌కి పోప్ ఆశీర్వాదాలు దొరికాయి అని పోస్ట్ చేసేసింది. ఇంకేముంది.. అంతా అయిపాయ్ అనుకోవాల్సొచ్చింది.

కానీ వాస్త‌వానికి ఆ సోష‌ల్ మీడియా అంటే ఆయ‌న‌కి అంత‌గా తెలీక పోవ‌చ్చు. ఆ ఇన్ స్టా గ్ర‌మ్ అంటే కూడా తెలీక పోవ‌చ్చు. ఆ ఫోటో ఆయ‌న చూసి కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. ఆయ‌న అకౌంట్ మేనేజ్ చేసేవాళ్లు ఎవ‌రో.. ఆమె అందానికి ప‌డిపోయి.. ఆ ఫోజుకి ఫ్లాట్ అయిపోయి. లైక్ కొట్టి ఉండొచ్చు. కానీ.. చీవాట్లు మాత్రం పోప్ కి త‌ప్ప‌ట్లేదు. ఎవ‌రికి మాత్రం ఏం చెప్ప‌గ‌లం. ఈ పాడు ప్ర‌పంచం ఊరుకుంటుందా.

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

   7 hours ago


ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

   8 hours ago


దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

   13 hours ago


కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

   14 hours ago


కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

   16 hours ago


రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

   04-12-2020


ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

   04-12-2020


రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

   03-12-2020


హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

   03-12-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle