newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మాస్కు పెట్టుకోలేదని.. ఆటో డ్రైవర్ పై పోలీసుల దాష్టీకం

08-04-202108-04-2021 08:45:45 IST
Updated On 08-04-2021 10:04:13 ISTUpdated On 08-04-20212021-04-08T03:15:45.772Z08-04-2021 2021-04-08T03:11:52.236Z - 2021-04-08T04:34:13.887Z - 08-04-2021

మాస్కు పెట్టుకోలేదని.. ఆటో డ్రైవర్ పై పోలీసుల దాష్టీకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! కరోనా మహమ్మారి ప్రబలకుండా కొన్ని నిబంధనలను ప్రభుత్వం తీసుకుని వచ్చింది. మాస్కులను తప్పని సరిగా ధరించాలని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మాస్కు ధరించకుంటే ఫైన్ లను విధిస్తూ ఉన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో మాస్కులు ధ‌రించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించకూడ‌ద‌ని పోలీసులు సూచిస్తున్నారు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్‌లో మాస్కు స‌రిగ్గా పెట్టుకోలేద‌ని ఓ వ్య‌క్తిని పోలీసులు న‌డిరోడ్డుపై కింద‌ప‌డేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇండోర్‌లో కృష్ణ కేయర్‌ అనే ఆటో డ్రైవర్ తండ్రి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తండ్రిని చూసేందుకు కృష్ణ త‌న కుమారుడితో కలిసి ఆటోలో బయలుదేరాడు. మార్గ‌మ‌ధ్యంలో అతని ఆటోను పోలీసులు ఆపారు. మాస్కును స‌రిగ్గా పెట్టుకోవాల‌ని సూచించారు.  ముక్కు కూడా క‌వ‌ర్ అయ్యేలా పెట్టుకోవాల‌ని, కేవలం నోటి వ‌ర‌కే పెట్టుకుంటే స‌రిపోద‌న్నారు. దీంతో పోలీసులు, కృష్ణ‌కు మ‌ధ్య‌ వాగ్వివాదం చోటు చేసుకుంది.

మామిడి కాయలు కోశారని తాళ్లతో కట్టేసి, పెంట నోట్లో కుక్కి.. అమానుష ఘటన 

ఆటోడ్రైవర్‌ను స్టేషన్‌కు రావాలని పోలీసులు చెప్పారు. తాను రాన‌ని చెప్ప‌డంతో కృష్ణ‌ను రోడ్డుపైనే పోలీసులు చిత‌గ్గొట్టారు. పోలీసులు దారుణంగా కొడుతుండడాన్ని పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. త‌న తండ్రిని కొట్టొద్ద‌ని అత‌డి కుమారుడు వేడుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. సంఘటన వెలుగులోకి రావడంతో ఆటోడ్రైవ‌ర్‌ను దారుణంగా కొట్టిన‌ పోలీసులు కమల్‌ ప్రజాపత్‌, ధర్మేంద్ర జాట్‌పై అధికారులు చ‌ర్య‌లు తీసుకుని, స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. పోలీసులు ఓవరాక్షన్ చేశారని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. 

మాస్కుల విషయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఉన్నాయి. కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఢిల్లీ హైకోర్టు కరోనా కట్టడికి పలు సూచనలు చేసింది. మాస్క్‌ను సురక్షణ కవచంగా పేర్కొంటూ, ఎవరైనా సరే కారులో ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ వారు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. మాస్క్ అనేది కోవిడ్-19 వైరస్‌ను అడ్డుకుంటుందని తెలిపింది.  ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్‌కర్ఫ్యూను విధించింది. 

 

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   10 hours ago


ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   15 hours ago


టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   20 hours ago


ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   21 hours ago


ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021


వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021


అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021


డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021


పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021


అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle