newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

26-07-202126-07-2021 08:38:44 IST
2021-07-26T03:08:44.571Z26-07-2021 2021-07-26T03:08:37.063Z - - 21-09-2021

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ‘నేషన్‌ ఫస్ట్‌.. ఆల్వేస్‌ ఫస్ట్‌’అనే నినాదంతో దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. భారతదేశానికి పరాయి పాలన నుంచి స్వాతంత్య్ర లభించి ఈ ఆగస్టు 15వ తేదీ నాటికి 74 ఏళ్లు పూర్తయ్యి 75వ సంవత్సరం రాబోతోంది. ఏడాది తర్వాత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహించుకుంటున్నాం. జాతిపిత మహాత్మాగాంధీ భారత్‌ చోడో ఆందోళన్‌ (క్విట్‌ ఇండియా ఉద్యమం) చేపట్టారు. అదే స్ఫూర్తితో ప్రతి భారతీయుడు భారత్‌ జోడో ఆందోళన్‌ (ఐక్య భారత ఉద్యమం)లో పాలు పంచుకోవాలి. వైవిధ్యం, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఐక్యంగా ఉండడం అందరి బాధ్యత.  

అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత జాతీయ గీతం జనగణమనను సాధ్యమైనంత ఎక్కువ మంది కలిసి ఆలపించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం http://rarhtrafan.in అనే వెబ్‌సైట్‌ను సృష్టించింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా జాతీయ గీతాన్ని ఆలపించి, రికార్డు చేసుకోవచ్చు. జాతీయ గీతం ఆలాపనతో మీరంతా అనుసంధానమై ఉంటారని ఆశిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మన ముందుకు రాబోతున్నాయని అన్నారు. అలాగే దేశంలో వివిధ కీలక రంగాల్లో పలువురు కొనసాగిస్తున్న కృషిని ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రశంసించారు. వాతావరణ నిపుణుడిగా (వెదర్‌ మ్యాన్‌) గుర్తింపు పొందిన సాయిప్రణీత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సాయిప్రణీత్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వాతావరణ సంబంధిత అంశాలను క్షుణ్నంగా విశ్లేషించడంలో దిట్టగా ప్రఖ్యాతి పొందారు. సాయి ప్రణీత్‌ తన ఆసక్తి, ప్రతిభను రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారని మోదీ కితాబిచ్చారు. వాతావరణ వివరాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి విశ్లేషిస్తూ, స్థానిక భాషలో రైతులకు సలహాలు, సూచనలు పంపడం అభినందనీయమన్నారు. కాగా ప్రధానమంత్రి నిర్వహించే మాన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఇటు ఆకాశవాణి, అటు దూరదర్శన్ లాభాల బాట పట్టాయని అధికారులు తెలపడం విశేషం.

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

   an hour ago


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

   19-09-2021


సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

   18-09-2021


గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

   18-09-2021


ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

   18-09-2021


పెట్రోల్, డీజిల్ ని GST కింద తీసుకురావడానికి ప్రయత్నించాం: నిర్మలా సీతారామన్.. కానీ

పెట్రోల్, డీజిల్ ని GST కింద తీసుకురావడానికి ప్రయత్నించాం: నిర్మలా సీతారామన్.. కానీ

   17-09-2021


11 వ తరగతి పరీక్షలను నిర్వహించడానికి ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

11 వ తరగతి పరీక్షలను నిర్వహించడానికి ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

   17-09-2021


ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 20 రోజుల మెగా వాక్సినేషన్ కార్యక్రమం

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 20 రోజుల మెగా వాక్సినేషన్ కార్యక్రమం

   17-09-2021


అయోధ్య రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తైంది

అయోధ్య రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తైంది

   16-09-2021


థర్డ్ వేవ్ లేదు.. రాబోయే ఆరు నెలల్లో కరోనా వైరస్ మరింత బలహీన పడుతుంది

థర్డ్ వేవ్ లేదు.. రాబోయే ఆరు నెలల్లో కరోనా వైరస్ మరింత బలహీన పడుతుంది

   16-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle