newssting
Radio
BITING NEWS :
రెండ్రోజుల్లో రామతీర్థానికి రానున్న విగ్రహాలు. టీటీడీ ఆధ్వర్యంలో సుందరంగా తయారవుతున్న విగ్రహాలు. * చెన్నైలోని క్రైస్తవ ప్రచారకుడి ఇంటిపై ఐటీ దాడులు. పాల్ దినకరన్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్న అధికారులు. చెన్నై కోయంబత్తూర్ సహా 28 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు. * అమెరికా అధ్యక్షుడి స్థానంలో చివరిసారిగా ప్రసంగించిన ట్రంప్. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగిన దాడిగా చూడాలన్న ట్రంప్. ప్రజలకు చెప్పిన దానికన్నా ఎక్కువే చేశానని పేర్కొన్న ట్రంప్. * అమెరికా 46వ అధ్యక్షుడిగా నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం. ఉపాధ్యక్షురాలిగా అచ్చమైన భారతీయ వనితగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్. * అమరావతి ఉద్యమం చేపట్టి 400 రోజులు అయిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమైన దేవినేని ఉమా. గొల్లపూడిలో సభలు, దీక్షలకు అనుమతి లేదన్న పోలీసులు. * అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకూ విరాళాల సేకరణ. విరాళాల సేకరణ కోసం మిగతా కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్న బీజేపీ నేతలు. బోరబండ నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన బండి సంజయ్.

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ నేడే.. టీకాపై చర్చ

11-01-202111-01-2021 12:46:30 IST
2021-01-11T07:16:30.016Z11-01-2021 2021-01-11T07:16:27.408Z - - 20-01-2021

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ నేడే.. టీకాపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా భేటీ కానున్నారు. ఈ బేటీలో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 కరోనా పరిస్థితిని ప్రధాని సమీక్షించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశం భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవలే రెండు దేశీయ కరోనా టీకాలకు అత్యవసర ఆమోదం కోసం ఆమోద ముద్ర వేసిన తర్వాత ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరుపుతున్న తొలి భేటీ కావడం విశేషం.

దేశ చరిత్రలోనే అతిపెద్దదైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కోటి మంది ఆరోగ్య సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది. జనవరి 16 నుంచి జూలై వరకు మొత్తం 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గత శనివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ని జనవరి 16 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మకర సంక్రాంతి, పొంగల్, బిహు వంటి అతి పెద్ద పండుగలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు జరుపుకుంటూ ఉండటంతో జనవరి 15 తర్వాతే టీకా కార్యక్రమం ప్రారంభించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా ఉన్న భారత్ గతంలో కూడా ప్రపంచానికి అవసరమై ప్రాణాధార ఔషధాలను సరఫరా చేసిందని ప్రధాని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు భారతయ టీకాలకోసం వేచి ఉండటమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎలా అమలు చేయనుంది అని తెలుసుకోవడానికి కూడా కుతూహలంగా ఎదురు చూస్తోందని ప్రధాని శనివారం భేటీలో చెప్పారు.

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్న ప్రధాని మోదీ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై సీఎంలతో విస్తృతంగా చర్చించనున్నారు. కరోనా టీకా సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్‌ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు దఫాలు డ్రై రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.

ఎర్రకోట బంద్.. తెరచుకునేది ఎప్పుడంటే..?

ఎర్రకోట బంద్.. తెరచుకునేది ఎప్పుడంటే..?

   23 minutes ago


మాల్దీవులు, నేపాల్ సహా ఆరు దేశాలకు భారతీయ వ్యాక్సిన్లు

మాల్దీవులు, నేపాల్ సహా ఆరు దేశాలకు భారతీయ వ్యాక్సిన్లు

   4 hours ago


జాక్ మా కనిపించాడుగా..!

జాక్ మా కనిపించాడుగా..!

   4 hours ago


న్యాయవాది నుంచి ఉపాధ్యక్షురాలి దాకా 'కమల హ్యారిస్' ప్రయాణం

న్యాయవాది నుంచి ఉపాధ్యక్షురాలి దాకా 'కమల హ్యారిస్' ప్రయాణం

   4 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 13,823 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 13,823 మందికి కరోనా

   5 hours ago


రిపబ్లిక్ డే 'ట్రాక్టర్ ర్యాలీ'కి సన్నాహాలు..

రిపబ్లిక్ డే 'ట్రాక్టర్ ర్యాలీ'కి సన్నాహాలు..

   6 hours ago


నేడే జో బైడన్, కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం..

నేడే జో బైడన్, కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం..

   7 hours ago


ఒక విషాదం మరవకముందే మరొకటి.. పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఒక విషాదం మరవకముందే మరొకటి.. పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

   7 hours ago


వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం

వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం

   17 hours ago


సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!

సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle