newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

గత ప్రభుత్వాల అసమర్థత వల్లే మధ్యతరగతిపై పెట్రోల్ భారం.. మోదీ వ్యాఖ్య

18-02-202118-02-2021 16:15:21 IST
2021-02-18T10:45:21.484Z18-02-2021 2021-02-18T10:45:16.202Z - - 08-03-2021

గత ప్రభుత్వాల అసమర్థత వల్లే మధ్యతరగతిపై పెట్రోల్ భారం.. మోదీ వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్ ధర వందరూపాయలు దాటిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ భారతీయ మధ్యతరగతిపై కాసింత సానుభూతి ప్రకటించారు. చమురుధరలతో మన మధ్యతరగతిపై పెనుభారం తప్పడం లేదని, కానీ గత ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించి ఉన్నట్లయితే దేశం చమురు దిగుమతుల భారం మోసేది కాదని మోదీ ఆరోపించారు. 

అంతర్జాతీయ ధరలతో ముడిపెట్టినందున దేశంలో చమురుధరలు నిత్యం పెరుగుతూనే ఉండటం తెలిసిందే. మోదీ ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ 85 శాతం చమురు అవసరాలను దిగుమతి చేసుకుంటోందని, అలాగే 53 శాతం వంటగ్యాస్ అవసరాలకోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చిందని మోదీ పేర్కొన్నారు.

చమురు కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని గతంలోని ప్రభుత్వాలు తగ్గించుకుని స్వావలంబన వైపు అడుగులు వేసి ఉంటే మన మధ్యతరగతిపై ఇంత భారం పడేది కాదని మోదీ పేర్కొన్నారు. అత్యంత వైవిధ్యపూరితమైన, ప్రతిభాసంపన్నమైన భారత్ వంటి దేశం ఇంధనం కోసం ఇంత అధికంగా దిగుమతులపై ఆధారపడాల్సిందేనా అని ప్రధాని ప్రశ్నించారు. 

తమిళనాడులో గ్యాస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఒక ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ చమురుధరల పెరుగుదలను గత ప్రభుత్వాలపైకి నెట్టే ప్రయత్నం చేశారు. నేను ఎవరిపైనా ఆరోపించాలని భావించడం లేదు కానీ చమురు ధరల పెరుగుదల సమస్యపై మనం గతంలోనే కేంద్రీకరించి ఉంటే మన మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడింత భారం పడేది కాదని మోదీ పేర్కొన్నారు.

దేశ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్ ధర రాజస్థాన్‌లో లీటరుకు వందరూపాయలు దాటడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. వరుసగా తొమ్మిదిరోజులుగా చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్రోల్ ధర చుక్కలంటింది. గత సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో అంతర్జాతీయ చమురు ధరలు రెండు దశాబ్దాల్లో అత్యంత కనిష్టంగా తగ్గిపోయినప్పటికీ మోదీ ప్రభుత్వం మాత్రం చమురు ధర తగ్గించకుండా ప్రజలపై మరింతగా చమురు సుంకాలు పెంచుతూ పోయి లబ్ధి పొందిందని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

పెట్రోల్ రిటైల్ ధరలో 60 శాతం వరకు కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలోనే పోతోంది. అదే లీటర్ డీజిల్‌పై 54 శాతం సుంకాల రూపంలో ప్రభుత్వాలకు చేరుతోంది. అయితే ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేనంత అధికంగా చమురు సుంకాలను భారత ప్రభుత్వం విధించడం గురించి ప్రస్తావించకుండా ప్రధాని చమురు స్వావలంబన గురించి మాట్లాడటం గమనార్హం.

అయితే చమురు ధరల భారంపై మధ్యతరగతి ఆందోళనను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, అందుకే ఇప్పుడు రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా ఇథనాల్ తయారీని పెంచడంపై కేంద్రం దృష్టి సారిస్తోందని మోదీ అన్నారు. చెరకు నుంచి తయారు చేసి ఇథనాల్‌ని పెట్రోల్‌లో కలపడం ద్వారా చమురు దిగుమతుల భారాన్ని తమ ప్రభుత్వం తగ్గించే ఏర్పాట్లు చేస్తోందని మోదీ చెప్పారు.

ప్రస్తుతం పెట్రోల్‌లో 8.5 శాతం ఎథనాల్ కలుపుతుండగా 2025 నాటికి దీన్ని 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ పేర్కొన్నారు. దీనివల్లో చమురు దిగుమతులు తగ్గడమే కాదు. రైతులకు ఇథనాల్ తయారీ ద్వారా అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉందన్నారు.

దేశీయంగా చమురు వనరులను పెంచుకోవడం కొనసాగిస్తూనే చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశలో తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

కాంగ్రెస్ చేసిన అన్ని తప్పుల్నీ సరిదిద్దుతున్నాం.. ప్రధాని మోదీ

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ

   5 hours ago


73 ఏళ్ల పెద్దాయ‌న‌కు పెళ్లి మోజు.. కోటి 30 ల‌క్ష‌ల‌తో అమ్మాయి జంప్

73 ఏళ్ల పెద్దాయ‌న‌కు పెళ్లి మోజు.. కోటి 30 ల‌క్ష‌ల‌తో అమ్మాయి జంప్

   5 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా

   13 hours ago


ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు

   13 hours ago


ఈ ఏడాదికి.. నారీ వారియ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేద్దాం

ఈ ఏడాదికి.. నారీ వారియ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేద్దాం

   15 hours ago


దీదీపై మోదీ సెటైర్లు..!

దీదీపై మోదీ సెటైర్లు..!

   07-03-2021


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!

   07-03-2021


కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ

   07-03-2021


ఆ సీడీలు బయటకు రాకుండా ఉండడానికి 5 కోట్ల డీల్ కూడా కుదిరిందట..!

ఆ సీడీలు బయటకు రాకుండా ఉండడానికి 5 కోట్ల డీల్ కూడా కుదిరిందట..!

   06-03-2021


సాగు చట్టాలను రద్దు చేయకుంటే 500 రోజులైనా ఆందోళనలు ఆపం.. రైతుసంఘాలు

సాగు చట్టాలను రద్దు చేయకుంటే 500 రోజులైనా ఆందోళనలు ఆపం.. రైతుసంఘాలు

   06-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle