newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

14-05-202114-05-2021 21:36:29 IST
Updated On 15-05-2021 09:00:25 ISTUpdated On 15-05-20212021-05-14T16:06:29.358Z14-05-2021 2021-05-14T16:06:24.801Z - 2021-05-15T03:30:25.986Z - 15-05-2021

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో రైతులకు భారీగా ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద ఎనిమిదో విడత గా మరో 20వేల కోట్ల రూపాయలను శుక్రవారం విడుదల చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ విడుదల చేసిన ఈ నిధుల వల్ల 9.5 కోట్లమందికి పైగా రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ పధకం కింద వార్షికంగా 14 కోట్లమంది రైతులకు 6000 రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగానే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమచేస్తారు.

శుక్రవారం విడుదల చేసిన నిధుల వల్ల పశ్చిమ బెంగాల్ కు చెందిన 7000మందికి పైగా రైతులు ప్రయోజనం పొందారు.పశ్చిమ బెంగాల్ రైతులకు ఈ పధకం ప్రయోజనాలు లభించడం ఇదే మొదటి సారి. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రైతుల సంఖ్య విషయంలో విభేధాలు తలెత్తడమే. నిధులను విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ప్రధాని మోడీ 2000 రూపాయల చొప్పున పశ్చమ బెంగాల్ రైతుల ఖాతాలోకి జమ అవుతాయని చెప్పారు. కోవిడ్ సంక్షోభ సమయంలో తమ ప్రభుత్వ పధకం వల్ల చిన్న, మధ్య తరగతి రైతులెందరో ప్రయోజనాన్ని పొందుతున్నారని చెప్పారు.  అలాగే  ఉత్తరాఖా౦డ్ కు చెందిన రైతులకు 171 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరింది. 2019 ఫిబ్రవరిలో ఈ పధకాన్ని ప్రారంభించారు.

ప్రధాన మంత్రి కిసాన్ పధకం కింద బెంగాల్ రైతులు మొదటి సారిగా రెండువేల రూపాయలను పొందిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాట్లాడారు. తమ రాష్ట్రానికి ఈ నిధులను బదలాయించడానికి కేంద్రం జాప్యం చేసిందని ఆరోపించారు. తమ ప్రభువం పట్టుదలగా పోరాటం చేయడం వల్లే ఈ కిసాన్ పధకాన్ని తమ రాష్ట్రంలోని రైతులకు వర్తింపజేశారని ఆమె అన్నారు. ఈ నెల 6వ తేదీన కిసాన్ పధకం ప్రయోజనాలను తమ రాష్ట్రానికి వర్తింపజేయాలని ప్రధాని మోదికి మమత బెనర్జీ లేఖ రాశారు. తమ రాష్ట్ర రైతులకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేవారకు పోరాటం సాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే బెంగాల్ లో కృషక్ బంధు పధక౦ కింద ఎకరానికి పైగా భూమి కలిగిన రైతులకు వార్షికంగా 5000 రూపాయలకు చొప్పున ఇస్తున్నామని మమత బెనర్జీ గుర్తు చేశారు.

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle