newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

29-09-202029-09-2020 10:41:31 IST
2020-09-29T05:11:31.162Z29-09-2020 2020-09-29T05:11:28.967Z - - 21-10-2020

కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతర్జాతీయంగా సరుకుల సరఫరా చైన్ కోసం కేవలం ఒకే ఒక్క వనరుపైనే అధికంగా ఆధారపడి ఉండటం ఎంత ప్రమాదకరమో కోవిడ్‌ తెలియజెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. డెన్మార్క్‌ ప్రధాని మెట్‌ ఫ్రెడరిక్సన్‌తో మోదీ సోమవారం వర్చువల్‌ విధానంలో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఈ క్లిష్ట సమయంలో గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌ను ఒకే దేశానికి బదులు అనేక దేశాలకు విస్తరించుకునే క్రమంలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాలతో భారత్‌ పనిచేస్తోందనీ, భావసారూప్యం గల దేశాలను ఆహ్వానిస్తోందని మోదీ వివరించారు.

గత కొద్ది నెలలుగా సంభవిస్తున్న పరిణామాలు పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థ, నియమాల ఆధారంగా ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. అధికార గణాంకాల ప్రకారం.. భారత్‌–డెన్మార్క్‌ ద్వైపాక్షిక వాణిజ్యం 2016–2019 సంవత్సరాల్లో 2.82 బిలియన్‌ డాలర్ల నుంచి 3.68 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 

సుమారు 200 డెన్మార్క్‌ కంపెనీలు దేశంలో నౌకాయానం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. డెన్మార్క్‌ కంపెనీల్లో 5వేల మంది భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు.

కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిన నేపథ్యంలో స్వావలంబన కోసం తమ ప్రభుత్వం ఆత్మనిర్బర్ భారత్‌ (స్వయం సమృద్ధ భారత్) కోసం చొరవ చేసిందని అలాగే వ్యవసాయంలో, లేబర్ మార్కెట్లో, పన్నుల వ్యవస్థలో  పలురంగాల్లో సంస్కరణలు చేపట్టామని మోదీ తెలిపారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle