newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ప్రత్యర్ధుల విమర్శలకి చెక్ పెట్టిన ప్రధాని మోడీ..

08-06-202108-06-2021 08:14:11 IST
2021-06-08T02:44:11.214Z08-06-2021 2021-06-08T02:44:04.315Z - - 14-06-2021

ప్రత్యర్ధుల విమర్శలకి చెక్ పెట్టిన ప్రధాని మోడీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కి సంభందించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. ఆయా రాష్ట్రాలకి వ్యాక్సినేషన్లు అందడం లేదని, వ్యాక్సినేషన్ల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని ప్రతిపక్షాలు మోడిపై విమర్శలు గుప్పించాయి. పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దానికోసం ఒక వెబ్ సైట్, మొబైల్ యాప్ ని కూడా రూపొందించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వెబ్ సైట్, యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే టీకాలు వేస్తామని తెలిపింది. 

అయితే ఈ విషయంలోనూ కేంద్రం విమర్శలు ఎదుర్కొంది. రిజేస్త్రేషన్ ప్రక్రియ కేవలం ఇంగ్లిష్, హిందీ భాషలలోనే అందుబాటులో ఉండడంతో ప్రాంతీయ భాషని మాట్లాడేవారు. రిజిస్ట్రేషన్ చేయడంలో భాషా సమస్యలని ఎదుర్కొన్నారు. దీంతో కేంద్రం 10 ప్రాంతీయ భాషలని సైతం వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. మరో వైపు ప్రైవేట్ హాస్పిటల్ లో వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారివద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలా అన్ని వైపుల నుండి వ్యాక్సిలేషన్ పంపిణీ విషయంలో కేంద్రం విఫలమైందని విమర్శలు వచ్చిన నేపధ్యంలో తాజాగా సోమవారం ప్రధాని మోదీ ప్రకటనతో ప్రత్యర్దులకి మోడీ చెక్ పెట్టినట్టయ్యింది. 

పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తుందని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయనక్కరలేదని, ఆ ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. మరో వైపు వ్యాక్సినేషన్ల తయారీ కోసం ఔషధ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటూంది. ఇప్పటికే బయోలాజికల్ ఈ సంస్థకి వ్యాక్సినేషన్ల తయారీ కోసం పదిహేను వందల కోట్ల రూపాయలని అడ్వాన్స్ గా అందించింది. మరి కొన్ని సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతుంది. రాబోయే రోజులలో వ్యాక్సినేషన్ కొరత లేకుండా కేంద్రం అన్ని చర్యలూ చేపడుతుంది. ప్రధాని ఇంత చేసినా ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. ఈ చర్యలు ఎప్పుడో తీసుకోవాల్సిందని, చాలా లేటుగా ఈ నిర్ణయాలు ప్రధాని తీసుకున్నారని విమర్శిస్తున్నాయి. మరి ఈ విమర్శలకి ప్రధాని ఎలా స్పందిస్తాడో చూడాలి.

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

   7 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   an hour ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle